Taraka Ratna : గత నెల 27న నందమూరి తారకతర్న లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో తారకరత్నహాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదలయాలలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. గత 20 రోజులుగా ఐసీయూలోనే కోమాలో ఉన్నారు తారకరత్న. ఆయన శరీరం వైద్యానికి స్పందిస్తుందని పేర్కొన్న వైద్యులు, విదేశీ వైద్యులను పిలిపించి మరీ ఆయనకు ప్రత్యేక వైద్య సేవలను అందిస్తున్నారు. తారకరత్నకు సుమారు రెండు వారాలుగా ట్రీట్మెంట్ అందిస్తున్న వైద్యులు ఇటీవల స్పెషల్ ట్రీట్మెంట్ ను విదేశీ వైద్యులతో మొదలుపెట్టారు.
విదేశీ వైద్యులను నారాయణ హృదయాలయ ఆసుపత్రికి పిలిపించి తారకరత్నకు గుండె సహా మెదడుకు సంబంధించిన సంబంధించిన స్పెషల్ ట్రీట్మెంట్ ను అందిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం తారకరత్న ప్రధాన అవయవాల తీరు మెరుగైంది. గుండె, కాలేయం, మూత్రపిండాలు సాధారణ స్థితికి వచ్చాయని, రక్త ప్రసరణ కూడా బాగుంది అని అంటున్నారు. మెదడులో మాత్రం సమస్య అలానే ఉంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా తారకరత్న మెదడుకు రక్త ప్రసరణ జరగలేదు. దాంతో మెదడు వాపుకు గురైంది. ఇది నయం అయితే తారకరత్న కోమా నుండి బయటకు వస్తాడని చెబుతున్నారు.
![Taraka Ratna : తారకరత్న ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది.. రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి..? how is Taraka Ratna health now what reports say](http://3.0.182.119/wp-content/uploads/2023/02/taraka-ratna.jpg)
ఇక నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్న ఆరోగ్యం గురించి ఆరా తీస్తూనే ఉన్నారు. బాలకృష్ణ ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నదన్న దానిపై నారాయణ హృదయాలయ వైద్యులు కూడా ఏ విషయము చెప్పకపోవడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. భార్య అలేఖ్య రెడ్డి తో పాటు, మరి కొంతమంది కుటుంబ సభ్యుల ఆసుపత్రిలో ఉన్నప్పటికీ వారెవరు నోరు మెదపడం లేదు. దీంతో తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన సేఫ్ గానే ఉన్నారా? లేదా ఇంకా ఆయన పరిస్థితి విషమంగానే ఉందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.