Honey Rose : నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుండగా, ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి బాలయ్యతో పాటు మిగతా చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. అయితే హనీరోజ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె ఈ మధ్యనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘మాన్ స్టర్’ అనే మూవీ రిలీజ్ కాగా, అందులో నటించి మెప్పించింది. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ మూవీలో మంచు లక్ష్మీ ఓ లెస్బియన్ గా ఛాలెంజింగ్ రోల్ చేయగా, హనీ రోజ్ తోనే ఈమె ప్రేమలో ఉండటం అలాగే ఆమెతో రొమాన్స్ చేయడం చేసింది. చిత్రంలో హనీ రోజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
గతంలో ఈమె తెలుగులో ‘ఆలయం’ ‘ఈ వర్షం సాక్షిగా’ వంటి సినిమాల్లో కూడా నటించింది. కానీ అంత పాపులర్ కాలేదు. ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ మూవీలో పెద్ద బాలయ్యకు భార్యగా నటిస్తుంది. ఈమె వయసు 31 ఏళ్ళు. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. కేరళలో పుట్టిన హనీ.. 14 ఏళ్ల ఏజ్ లోనే యాక్టర్ అయిపోయింది. అంటే 2005లో నటిగా మలయాళంలో తొలి సినిమా చేసింది. అయితే అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది.
బాలయ్య కొత్త సినిమా వీరసింహారెడ్డి చిత్రంలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ పాటలో డ్యాన్స్ తోపాటు మంచి క్యారెక్టర్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న హానీరోజ్ తన గ్లామర్‌తో ఎప్పటికప్పుడు అందరి మనసులు కొల్లగొడుతూ ఉంటుంది. ఈ అమ్మడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలుగమ్మాయి మాదిరిగానే అచ్చమైన తెలుగులో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించింది. శృతి హాసన్ తెలుగులో మాట్లాడకపోయిన హనీ మాత్రం చక్కగా తెలుగు మాట్లాడింది. అయితే దాదాపు పదేళ్ల తర్వాత హనీ రోజ్ తెలుగులో నటిస్తుంది. మరి ఈ చిత్రం హనీకి ఎంతగా కలిసొస్తుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…