Health Tips : కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మొదట ఆ కుంటుంబంలోని మహిళ ఆరోగ్యంగా ఉండాలి. భౌతికంగా స్త్రీలు పురుషుల కంటే కాస్త బలహీనంగా ఉంటారు. ప్రతి నెల వచ్చే పీరియడ్స్ వల్ల కూడా మరింత బలహీనంగా తయారవుతారు. వీటన్నింటికి తోడుగా కుటుంబంలో జరిగే గొడవలు కొందరు భర్తలు చేసే కొన్ని పనుల వల్ల మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారట. అంతే కాకుండా కొంతమంది భర్తల వల్ల భార్యలు త్వరగా అనారోగ్యానికి సైతం గురవుతున్నారని తాజాగా ఓ సర్వే పేర్కొంది.
భర్తలు తాగుడుకు లేదా చెడు అలవాట్లకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వల్ల భార్యలు మానసిక క్షోభను అనుభవిస్తారట. పిల్లల ఆలనా పాలనా చూసుకోవడం, డబ్బులు సంపాదించడం, ఇంట్లో పనిచేయడం ఇలా అన్ని రకాలుగా ఇబ్బుందులు పడి చివరికి అనారోగ్యం బారిన పడే అలకాశాలు కూడా ఉన్నాయట.
కొంత మంది భర్తలు ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా భార్యపై అనుమానపడటం.. ఆమెను వేధించడం లాంటివి చేస్తారట. అలా చేయడం వల్ల కూడా భార్యలు ఒత్తిడికి లోనై అనారోగ్యానికి గురవుతారట. కొంతమంది భర్తలు ఉద్యోగం చేసి ఇంట్లో పెత్తనం చెలాయిస్తారు. ఉద్యోగం చేయడం తప్ప మరో పని చేయరు. అయితే భార్య మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇంట్లో పనులు చేయడం.. పిల్లలను చూసుకోవడం తప్పదు.
దాంతో మానసికంగా శారీరంగా స్ట్రెస్ పెరగటం వల్ల చిన్న వయసులోనే బీపీలు, షుగర్ ల బారిన పడుతున్నారట. కాబట్టి భర్తలు కాస్త సమయం దొరికినప్పుడు భార్యలకు సహాయ పడటం.. చెడు అలవాట్లు ఉంటే మానుకుని కుటుంబాన్ని చక్కగా చూసుకోవడం వల్ల అందరూ సంతోషంగా ఉండవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు.