Rice Water : ప్రస్తుత తరుణంలో చాలా మంది జంక్ ఫుడ్‌కి, ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయారు. ఎక్కువగా బయట రెస్టారెంట్లలోనే తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఇంట్లో తిన్నా కూడా జంక్ ఫుడ్‌నే ఎక్కువగా తింటున్నారు. ఈ క్రమంలోనే పూర్వం రోజుల్లో మన పెద్దలు తీసుకున్న ఆహారాన్ని అందరూ మరిచిపోతున్నారు. అలాంటి వాటిల్లో గంజి కూడా ఒకటి. ఒకప్పుడు గంజిని ఎంతో ఇష్టంగా తాగేవారు. కానీ ఇప్పుడు గంజి అంటేనే ఎవరికీ తెలియడం లేదు. అయితే వాస్తవానికి గంజి తాగడం వల్ల ఎన్నో అద్బుతమైన లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గంజి తాగడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. వేడి వేడి గంజిలో కాస్త ఉప్పు, కారం కలిపి తాగితే ఉత్సాహంగా మారుతారు. బద్దకం పోతుంది. చురుగ్గా పనిచేస్తారు. గంజి తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలోకి వస్తుంది. దీంతో జ్వరం తగ్గుతుంది. జ్వరం వచ్చిన వారు గంజిని తాగితే త్వరగా కోలుకుంటారు. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వచ్చిన వారు ఇలా చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. ఇక గంజిని కాస్త తీసుకుని తలకు పట్టించి కాసేపు అయ్యాక తలస్నానం చేయాలి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు నుంచి బయట పడవచ్చు. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి. దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.
గంజిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాస్త అలసటగా నీరసంగా నిస్సత్తువుగా ఉన్నప్పుడు గంజి తాగితే తక్షణ శక్తి వస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. వాంతులు, విరేచనాలతో బాధపడేవారికి గంజి ఇస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. గంజిని ముఖానికి రాస్తే కాంతివంతంగా మారుతుంది. అదే జుట్టుకు రాస్తే గంజిలో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు రాలకుండా మృదువుగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇలా గంజితో ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చు. కనుక గంజిని క్రమం తప్పకుండా రోజూ తాగండి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండండి.