Pragathi Bhavan : ఇన్నాళ్లు కేసీఆర్ అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్ ఇప్పుడు.. ప్రజా భవన్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలె ప్రజా భవన్‌గా మార్చిన విషయం తెలిసిందే. సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే.. ఆయన ప్రగతి భవన్ వదిలి వెళ్లిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రగతి భవన్‌లో ఇకపై డిప్యూటీ సీఎం భట్టి ఉండనున్నారు. ప్రగతి భవన్ అనేది హైదరాబాద్ బేగంపేట్‌లో ఉండే సువిశాల భవంతి. మొన్నటివరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండేది. ఎక్కువశాతం అధికారిక సమీక్షలను ఇక్కడే నిర్వహించే వారాయన. మంత్రులు, అధికారుల రాకపోకలతో కళకళలాడుతుండేది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార మార్పిడి చోటు చేసుకోవడం వల్ల ఈ భవానన్ని కేసీఆర్ ఖాళీ చేయాల్సి వచ్చింది. దీని ముందు ఉన్న ఇనుప బ్యారికేడ్లు, గేట్లన్నింటినీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే వాటన్నింటినీ తీసివేశారు. దీని తరువాత పెద్ద సంఖ్యలో దీన్ని సందర్శించడానికి స్థానికులు వచ్చేవారు.కొండా సురేఖ సహా కొందరు మంత్రులు ప్రజా వాణి కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహిస్తోన్నారు. ముఖాముఖిగా ప్రజలను కలుసుకుంటోన్నారు. వారి నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరిస్తోన్నారు.

ప్రగతి భవన్ లోపలి సుందర దృశ్యాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. కేసీఆర్ ఈ భవన్‌ణి చాలా అందంగా తీర్చిదిద్దారు. ఒకప్పటి రాజులు కట్టుకున్న ప్యాలెస్ మాదిరిగా ఈ ప్రగతతి భవన్ ఉంది. ప్రస్తుతం ప్రగతి భవన్ విజువల్స్ బయటకు రాగా, ఇది చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి విశాలమైన భవంతిని విడిచిపోవడానికి కేసీఆర్ ఎంత బాధపడి ఉంటారా అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రగతి భవన్ విజువల్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.