Janasena : ఇప్పుడు ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. అయితే జనసేన పార్టీ గతంలో కన్నా ఇప్పుడు మరింత మెరుగుపడినట్టు తెలుస్తుంది. టీడీపీ – జనసేన పొత్తు దాదాపు ఖరారైంది. వైసీపీ ఒంటరి పోరుకు సిద్ద అవుతోంది. ఇదే సమయంలో గెలుపుపైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలోనే జనసేన పార్టీ సర్వే చేయించగా, గతంలో కన్నా గ్రాఫ్ పెరిగినట్టు తెలుస్తుంది. జనసేన బలం ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటముల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతోంది.
రీసెంట్‌గా నాగబాబు కూడా జనసేన గ్రాఫ్ పెరిగిందంటూ కొత్త లెక్కలు చెప్పారు. 2019 ఎన్నికల్లొ జనసేన బలం దాదాపు 7 శాతంగా ఉంది. ఇప్పుడు జనసేన గ్రాఫ్ 24.5 శాతానికి పెరిగిందంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ఈ లెక్కన ఈ నాలుగేళ్ల కాలంలో జనసేన బలం ఏకండా మూడు రెట్లకు పైగా పెరిగింది. మరి..జనసేనకు ఇప్పుడు 24.5 శాతం ఓట్ల శాతం ఉంటే.. టీడీపీ – వైసీపీ పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ఓట్లు రాగా, టీడీపీకి దాదాపుగా 40 శాతం ఓట్లు దక్కాయి. జనసేనకు 7 శాతం, ఇతర పార్టీలకు 3 శాతం మేర వచ్చాయి.

ఇప్పుడు టీడీపీతో జనసేన పోత్తు పెట్టుకోగా, ఏయే స్థానాలలో ఎవరిని దింపాలనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయట. టీడీపీ కంచుకోటగా భావించే కొన్ని స్థానాలలో జనసేన సీట్లు ఆశిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రానున్న రోజులలో ఏమైన జరగొచ్చు. ఇటీవల అయ్యన్న పాత్రుడు పొత్తుల విషయం, సీట్ల పెంపకం పెద్ద విషయమేమి కాదని చెప్పారు. జనసేనకి 40వేల సీట్లు వచ్చిన కూడా ఆ పార్టకి ఇస్తామని అంటున్నారు. జనసేన బలం పెరిగిందన్న అంశాన్ని టీడీపీ ఎంత వరకు స్వీకరిస్తుంది అనేది చూడాల్సి ఉంది. అయితే రెండు పార్టీల అవగాహన, గెలుపు వ్యూహాన్ని బట్టి సీట్ల పంపకం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీతో కలిసి వెళ్లటం ద్వారా అధికారంలో భాగస్వాములు కావాలనేది జనసేన వ్యూహంగా కనిపిస్తోంది.
BUT PK IS SINGLEHANDEDLYSTRIVING HDTO FIGHT . MORE GOOD SPAKERS ARE NEEDED.