Harish Rao : ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయం మరింత వేడెక్కిస్తున్నారు. రీసెంట్‌గా తెలంగాణ మంత్రి హరీష్ రావు.. మోదీతో పాటు జగన్‌పై కూడా మండిపడ్డారు. మోదీ వచ్చి పెద్ద నీతులు చెప్పే ప్రయత్నం చేశారన్నారు. మోదీ ది పూటకో మాట.. రాష్ట్రానికో మాట చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ అద్భుతంగా పని చేస్తున్నాడని పార్లమెంట్‌లో చెప్పారన్నారు. కేసీఆర్ ఎప్పుడు వచ్చినా నీళ్లు, ప్రాజెక్టులు, కరెంటు అభివృద్ధి గురించి మాట్లాడితే… ఏపీ నాయకుడు కేసుల గురించి మాట్లాడతారని పార్లమెంట్ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు.
ఢిల్లీలో ఒక మాట, తెలంగాణ గల్లీల్లో ఒక మాట అంటున్నారని మండిపడ్డారు. నిన్న కాక మొన్న కర్ణాటకలో దేవెగౌడ్‌తో పొత్తు పెట్టుకున్నావ్… అక్కడ ఏం చెప్తావ్ అని ప్రశ్నించారు. జ్యోతిరాదిత్య సిందియా, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్ ఎవరు… సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్‌గా రాలేదు ప్రజలు లక్ష ఓట్లతో గెలిపిస్తే ప్రజాక్షేత్రం నుంచి వచ్చి పని చేస్తున్నామని తెలిపారు. ‘‘మీ మాదిరి రాజ్యసభ, మంత్రి పదవులు మాకు కేసీఆర్ ఇవ్వలేదు… ఉద్యమం చెయ్యమని చెప్పాడు. పోరాటాలు, ఉద్యమాలు, జైలుకు పోయినం. మీరు నామినేటెడ్ పదవులు ఇచ్చి కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారు. ప్రధాన మంత్రి స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎన్నికలు వస్తున్నాయని రాజకీయం కోసం మాట్లాడడం చాలా దురదృష్టకరం. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బీ టీం’’ అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
తెలంగాణలో బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ వచ్చేది లేదు. పాలమూరు ప్రాజెక్టుకు కృష్ణా నీటి కేటాయింపుకి అడ్డుపడుతున్న బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారంటా, తెలంగాణను కూడా అమ్ముకుంటారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన ఓటు వేస్ట్ చేసుకోవడమే. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారు. కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేకా, బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టిన వాళ్లను తీసుకొని అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు.” అని హరీష్ రావు అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…