Haris Rauf : ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్ 2024 రసవత్తరంగా సాగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రపంచ కప్ లో చెత్త ప్రదర్శనతో పాటు ఆ జట్టు ఆటగాళ్లు నడుచుకుంటున్న తీరుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. పొట్టి ప్రపంచకప్‌లో తమ ప్రయాణం ముగిసినప్పటికి కూడా కొందరు పాక్ ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లకుండా ఇంకా అమెరికాలోనే ఉన్నారు. పాకిస్తాన్ పేసర్ హ్యారీస్ రౌఫ్ తన భార్యతో కలిసి అమెరికాలో షికార్లు కొడుతున్నాడు. అయితే.. అతడు ఓ అభిమానితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ అమెరికాలో ఓ అభిమానితో గొడవపడ్డాడు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ వైరల్ గా మారింది. గత ప్రపంచ కప్ లో రన్నరప్ గా నిలిచిన పాకిస్థాన్ ఘోర ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఈ వివాదం చెలరేగింది. యుఎస్ఏ, వారి చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో షాకింగ్ ఓటముల తరువాత ఐర్లాండ్ పై ఓదార్పు విజయాన్ని మాత్రమే ఆ జట్టు సాధించగలిగింది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో హారీష్ రవూఫ్ అభిమానితో వాగ్వాదానికి దిగినట్లు వీడియో అందరిని ఆశ్చర్యపరచింది. తీవ్ర ఆగ్రహానికి గురైన రవూఫ్ ‘యే ఇండియన్ హోగా’ అంటూ ఆ అభిమాని పై విరుచుకుపడ్డాడు. అయితే, తాను భారతీయుడు కాదనీ, ‘పాకిస్తానీ హు’ అని రిప్లై ఇచ్చాడు.
![Haris Rauf : సెల్ఫీ అడిగిన ఫ్యాన్‌తో పాక్ పేసర్ రవూఫ్ దురుసు ప్రవర్తన.. మండిపడుతున్న నెటిజన్లు.. Haris Rauf behavior against a fan who asked him selfie](http://3.0.182.119/wp-content/uploads/2024/06/haris-rauf.jpg)
అయితే, రవూఫ్ ను శాంతింపజేసి ఉద్రిక్తతను తగ్గించేందుకు అతని భార్య ప్రయత్నించినప్పటికీ పరిస్థితి మరింత ముదిరింది. అయినా సరే సదరు అభిమాని, రవుఫ్‌లు కాసేపు తిట్టుకున్నారు. అయితే.. గొడవకు అసలు కారణం ఏంటనేది మాత్రం తెలియలేదు. ‘అతడు కచ్చితంగా భారతీయుడే అయి ఉంటాడు’ అని రవుఫ్ అనడం వీడియోలో రికార్డు అయింది. అయితే.. సదరు అభిమాని ‘నేను పాకిస్థానీ’ అని బదులిచ్చాడు. దాంతో, రవుఫ్ కాస్త కూల్ అయ్యాడు. వరల్డ్ కప్‌లో దారుణ ఓటమిపై ఆ అభిమాని రవుఫ్‌ను నిలదీసి ఉంటాడు. అందుకనే మనోడు చిర్రుబుర్రులాడి ఉంటాడు అని అందరు భావిస్తున్నారు. . ‘టీ20 వరల్డ్ కప్ లో ఘోర అవమానం ఎదుర్కొన్న తర్వాత పాక్ ఆటగాళ్లు పిచ్చివాళ్లయ్యారు’ అని ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు. అలాగే, ‘ఐసీసీ దయచేసి హారిస్ లాంటి ఆటగాడిపై నిషేధం విధించండి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Haris Rauf Fight
His wife tried to stop her.
Haris- Ye indian ho hoga
Guy- Pakistani hu @GaurangBhardwa1 pic.twitter.com/kGzvotDeiA— Maghdhira (@bsushant__) June 18, 2024