Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా, హీరోగా తెలుగు పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నందమూరి హీరోలు ఎలాంటి గుర్తింపునందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అందులో కళ్యాణ్ రామ్ కూడా తనదైన శైలిలో డిఫరెంట్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా సింపుల్‌గా ఉండే కళ్యాణ్ రామ్ తన పర్సనల్ విషయాలని ఎక్కడ కూడా బయట షేర్ చేసుకోడు. నందమూరి కళ్యాణ్ రామ్ మొదట ఎన్టీఆర్ తరహాలోనే 14 ఏళ్ల వయసులోనే బాల నటుడిగా వెండితెరపై కనిపించాడు. 1989లో వచ్చిన బాలగోపాలుడు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదటిసారి వెండితెరపై కనిపించాడు.
ఇక చివరిగా బింబిసార చిత్రంతో మంచి హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. కళ్యాణ్ రామ్.. 2006 ఆగస్టు 9వ తేదీన స్వాతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె హరికృష్ణకు బాగా పరిచయమున్న ఒక బిజినెస్ మెన్ కూతురు. బాగా ఉన్నత చదువులు చదివినప్పటికి కూడా సాంప్రదాయాలకు విలువనిచ్చే ఫ్యామిలీ కనుక హరికృష్ణ వెంటనే ఒప్పేసుకున్నారు. ఇక కళ్యాణ్ రామ్ ఆ విషయంలో తండ్రి మాటకు విలువనిచ్చే స్వాతిని పెళ్లి చేసుకున్నాడు.
అయితే హరికృష్ణకు తన సంతానంలో ఒక్కరినైనా డాక్టర్ చదివించాలని ఉండేదట. కానీ ఎవరూ మెడిసిన్ చదవలేదు. స్వాతి డాక్టర్ అని తెలియడంతో హరికృష్ణ సంతోషపడ్డారు. అయితే పెళ్లి తర్వాత స్వాతిని ఉన్నత చదువులు చదువుకుంటావా అని అడగ్గా.. మెడిసిన్ చదివే ఆసక్తి లేదని, వీఎఫ్ఎక్స్ సంస్థను స్థాపిస్తానని చెప్పడంతో కల్యాణ్ రామ్ కూడా ఓకే చెప్పారు. ఈ విషయంలోనే కల్యాణ్ రామ్ పై హరికృష్ణ గుర్రుగా ఉన్నాడట. డాక్టర్ చదివించనందుకు కళ్యాణ్ రామ్‌తో కొన్ని రోజులు మాట్లాడలేదని అంటారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…