Hansika : సైలెంట్‌గా పెళ్లి ప‌నులు చేసుకుంటున్న హ‌న్సిక‌.. వ‌రుడు ఎవ‌రో తెలుసా..?

Hansika : యాపిల్ బ్యూటీ హ‌న్సిక దేశ ముదురు చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో చాలా అమాయ‌కంగా న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది.చైల్డ్ ఆర్టిస్ట్ గా కరియర్ ను మొదలుపెట్టి అల్లు అర్జున్ హీరోగా నటించిన “దేశముదురు” సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్న ఈ మిల్కీ బ్యూటీ ఆ తరువాత కన్నడ, హిందీ, మరియు తమిళ భాషల్లో బిజీగా మారింది. ఈ మధ్యనే తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటించిన “తెనాలి రామకృష్ణ బీ ఏ బీ ఎల్” సినిమాలో నటించిన హన్సిక ఇప్పుడు పెళ్లి వార్త‌ల‌తో హాట్ టాపిక్‌గా మారింది.

హన్సిక మోత్వాని డిసెంబర్ లో జైపూర్ కోటలో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయి.. అని ప్రముఖ మీడియాలో కథనాలు వెలువడడం సంచలనమైంది.ఈ అమ్మ‌డు గ‌తంలో పలువురు హీరోలతో ప్రేమాయణాలు సాగించిందని కథనాలొచ్చాయి. ఇంతకుముందు తమిళ హీరో సింబుతో ప్రేమాయణం బ్రేకప్ గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డు త‌న బాయ్ ఫ్రెండ్‌ని వివాహం చేసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం.

Hansika reportedly getting married
Hansika

450 ఏళ్ల నాటి కోట జైపూర్ ప్యాలెస్ వేదిక గా ఈ అమ్మ‌డి పెళ్లి జ‌ర‌గ‌నుంది. అయితే పాతకాలపు ట్రెడిషనల్ టచ్ తో రాయల్ గా ఉంటుందని ఈ వేదిక ఫిక్స్ చేసింద‌ట . విలాసవంతమైన డెస్టినేషన్ వెడ్డింగ్ తనకు తనకు కాబోయే భర్తకు జీవితకాల జ్ఞాపకాలను అందిస్తుందనడంలో సందేహం లేదని సదరు కథనం వెల్లడించింది.ఇక వివాహం కోసం అతిథుల సౌకర్యం కోసం ప్యాలెస్ లో గదులు సిద్ధం చేస్తున్నారని… పనులు జరుగుతున్నాయని ప్యాలెస్ కి చెందిన ఒక సోర్స్ వెల్లడించింది. జైపూర్లోని ముండోటా కోట -ప్యాలెస్ లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీల వివాహాలు జరిగాయి. ఇక్కడ హన్సిక తన డ్రీమ్ బోయ్ ని వివాహం చేసుకోనుంది. ఇక హ‌న్సిక 50వ సినిమా ప్రాజెక్ట్ `మహా` ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. తదుపరి ఆమె తమిళ చిత్రం `రౌడీ బేబీ`లో కనిపించనుంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago