Hansika : యాపిల్ బ్యూటీ హన్సిక దేశ ముదురు చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చాలా అమాయకంగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.చైల్డ్ ఆర్టిస్ట్ గా కరియర్ ను మొదలుపెట్టి అల్లు అర్జున్ హీరోగా నటించిన “దేశముదురు” సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్న ఈ మిల్కీ బ్యూటీ ఆ తరువాత కన్నడ, హిందీ, మరియు తమిళ భాషల్లో బిజీగా మారింది. ఈ మధ్యనే తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటించిన “తెనాలి రామకృష్ణ బీ ఏ బీ ఎల్” సినిమాలో నటించిన హన్సిక ఇప్పుడు పెళ్లి వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది.
హన్సిక మోత్వాని డిసెంబర్ లో జైపూర్ కోటలో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఇప్పటికే పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయి.. అని ప్రముఖ మీడియాలో కథనాలు వెలువడడం సంచలనమైంది.ఈ అమ్మడు గతంలో పలువురు హీరోలతో ప్రేమాయణాలు సాగించిందని కథనాలొచ్చాయి. ఇంతకుముందు తమిళ హీరో సింబుతో ప్రేమాయణం బ్రేకప్ గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్‌ని వివాహం చేసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
450 ఏళ్ల నాటి కోట జైపూర్ ప్యాలెస్ వేదిక గా ఈ అమ్మడి పెళ్లి జరగనుంది. అయితే పాతకాలపు ట్రెడిషనల్ టచ్ తో రాయల్ గా ఉంటుందని ఈ వేదిక ఫిక్స్ చేసిందట . విలాసవంతమైన డెస్టినేషన్ వెడ్డింగ్ తనకు తనకు కాబోయే భర్తకు జీవితకాల జ్ఞాపకాలను అందిస్తుందనడంలో సందేహం లేదని సదరు కథనం వెల్లడించింది.ఇక వివాహం కోసం అతిథుల సౌకర్యం కోసం ప్యాలెస్ లో గదులు సిద్ధం చేస్తున్నారని… పనులు జరుగుతున్నాయని ప్యాలెస్ కి చెందిన ఒక సోర్స్ వెల్లడించింది. జైపూర్లోని ముండోటా కోట -ప్యాలెస్ లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీల వివాహాలు జరిగాయి. ఇక్కడ హన్సిక తన డ్రీమ్ బోయ్ ని వివాహం చేసుకోనుంది. ఇక హన్సిక 50వ సినిమా ప్రాజెక్ట్ `మహా` ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. తదుపరి ఆమె తమిళ చిత్రం `రౌడీ బేబీ`లో కనిపించనుంది.