GT Vs CSK IPL 2023 Final : మొత్తానికి ఈ ఏడాది ఐపీఎల్ సమరం ముగిసింది. ఎవరు కప్ సాధిస్తారా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆశతో ఎదురు చూడగా, 16వ ఎడిషన్ లో ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో సీఎస్‌కే గెలిచి, ట్రోఫీని దక్కించుకొని భలా అనిపించింది. ఈ క్రమంలో ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది. చివరి వరకు ఉత్కంఠంగా జరిగిన ఈ మ్యాచులో చెన్నై చివరి బంతికి విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్లను 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ధోనీసేనకి మరోసారి వరుణుడు అడ్డంగా నిలిచాడు. దీంతో దాదాపు 3 గంటలు వర్షం కారణంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్ అర్ధ రాత్రి మొదలయింది. దీంతో చెన్నై లక్ష్యాన్ని డక్ వర్త్ 15 ఓవర్లలో 171 పరుగులు కుదించాల్సి వచ్చింది. అయితే ఆటగాళ్లలు దూకుడుగా బ్యాటింగ్ చేసి తమ జట్టుకి విజయాన్ని అందించారు. దీంతో రికార్డ్ స్థాయిలో 5 వ సారి చెన్నై ఐపీఎల్ టైటిల్ అందుకుంది. అయితే ఈ ట్రోఫీ ధోని అందుకోకుండా ఇద్దరి ప్లేయర్లని స్టేజ్ మీదకి పిలిచి సర్ ప్రైజ్ చేసాడు. సహచర ప్లేయర్లయినటువంటి జడేజా, రాయుడుని ట్రోఫీ అందుకోవాల్సిందిగా కోరాడు.
అంబటి రాయుడికి ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్ కాగా .. జడేజా మాత్రం అసాధ్యం అనుకున్న మ్యాచ్ ని సుసాధ్యం చేసి చెన్నైకి మర్చిపోలేని విజయాన్ని అందించాడు. వీరిద్దరే ఈ ట్రోఫీ తీసుకోవడానికి నిజమైన అర్హులు అని భావించిన ధోని వారిని స్టేజ్ మీదకి పిలిచి ట్రోఫీ తీసుకోవాల్సిందిగా కోరాడు. మోహిత్ శర్మ బౌలింగ్‌లో 5వ బంతికి సిక్సర్, చివరి బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించచిన ధోని.. జడేజాను పైకి ఎత్తుకుని భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లు కూడా వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.