Gone Prakash Rao : ఒకవైపు ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్న సమయంలో తెలంగాణ రాజకీయాలు కూడా రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా కవిత విషయంలో తెలంగాణ రాజకీయం మారుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. లిక్కర్ స్కాంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మొదట ఈడీ అరెస్ట్ చేయగా.. న్యాయస్థానం ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న తీహార్ జైలులో ఉన్న సమయంలోనే.. సీబీఐ కూడా అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంది. అయితే.. ఇప్పటికే సీబీఐ కస్టడీని సవాలు చేస్తూ బెయిల్ పిటిషన్ వేయగా.. కోర్టు తోసిపుచ్చగా.. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈరోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. విచారణను మరోసారి వాయిదా వేసింది.
అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్స్ మంచి రసవత్తరంగా సాగుతున్న నేపథ్యంలో గోనె ప్రకాశరావు.. కవితతో పాటు సంతోష్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కవిత జాగృతి పేరుతో బాగా దోచుకుందని, అలానే సంతోష్ కూడా వేల కోట్లు వెనకేసుకున్నట్టు ఆయన ఆరోపణలు చేశారు. ఇటీవల ఐఏఎస్ మరియు ఐపిఎస్ అధికారులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు వ్యాఖ్యలు సరికావని, ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ఉద్యోగులు నిబద్ధతతో పని చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, ఇతర నేతలు అన్నారు. గోనె ప్రకాశరావు ప్రధానంగా ఓ మహిళా కలెక్టర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ రోజు పార్టీని సర్వనాశనం చేశారు. డబ్బులు తీసుకొని పార్టీని నడిపిస్తున్నారు. కర్ణాటకలో ఎందుకు రాజీనామాలు చేయించారు. మీ దగ్గర ఎందుకు చేయించడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని గోనె సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే ఈడీ నోటీసులు ఇచ్చాక తన వాట్సాప్ డేటాను కవిత డిలీట్ చేశారని అధికారులు ఆరోపించారు. డిజిటల్ ఆధారాలు లేకుండా ముందు జాగ్రత్తపడ్డారని పేర్కొన్నారు. కవితా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అని… ఆమెకు నోటీసు ఇచ్చిన వెంటనే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు.