Getup Srinu : బుల్లితెరపై సుడిగాలి సుధీర్ ఇమేజ్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన జబర్ధస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో పాటు ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. సుధీర్ అని పేరు కనబడగానే నవ్వులు మొహాలపై అలా వచ్చేస్తాయంతే. అంతగా తన కామెడీతో మ్యాజిక్ చేసాడు సుధీర్. నిజంగానే సుడిగాలి లాంటి పంచులతో కితకితలు పెట్టడంలో ముందుంటాడు . ఈ మధ్య స్మాల్ స్క్రీన్ కంటే పెద్ద స్క్రీన్‌పై కనిపించడం అలవాటు చేసుకున్నాడు సుధీర్. అక్కడే వరస సినిమాలు చేస్తున్నాడు కూడా.రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఇప్పటికే హీరోగా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘త్రీ మంకీస్’, ‘వాంటెడ్ పండుగాడ్’ వంటి చిత్రాలతో అలరించారు. చివరిగా ‘గాలోడు’తో మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. బుల్లితెరపై సూపర్ స్టార్‌గా ఫేమస్ అయిన సుధీర్ నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలీషా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. యానిమల్’తో పోటీగా రావడం లేదు.. యానిమల్‌తో పాటుగా వస్తున్నాం. ఈ చిత్రంలో చాలా ట్విస్టులుంటాయి. ఆ ట్విస్టులు అందరికీ తెలిసినా కూడా థియేటర్‌కు వచ్చి చూస్తారు. ఇందులో మంచి ప్రేమ కథ కూడా ఉంటుందని దర్శకుడు అన్నారు.
అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ జరగగా, ఆ కార్యక్రమంలో గెటప్ శీను తనదైన శైలిలో మాట్లాడాడు. చిత్ర బృందం గురించి గొప్పగా మాట్లాడిన గెటప్ శీను తన ఫ్రెండ్ సుధీర్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుధీర్ చాలా కష్టపడుతున్నాడు. అందుకే ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రతి సినిమా కోసం మేము ఇలా ఇచ్చి వాడి గురించి మాట్లాడుతున్నాం అంటే అంత కంటెంట్ ఇస్తున్నాడు. గాలోడు సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత కొన్ని థియేటర్స్ హౌజ్‌పుల్ అయ్యాయంటే సుధీర్ క్రేజ్ ఎలా పెరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఆయన తన అభిమానులని ఫ్యామిలీగా చూస్తాడు అంటూ క్రేజీ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం గెటప్ శీను కామెంట్స్ వైరల్‌గా మారాయి.