Geetanjali Girija : మేలిమి ముత్యాల్లాంటి సినిమాలు తీస్తూ దేశం గర్వించదగ్గ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మణిరత్నం. ఆయన తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. నాయకుడు, రోజా, బొంబాయి వంటి చిత్రాలు కేవలం తమిళంలో మాత్రమే కాక తెలుగులోకి డబ్ అయి భారీ విజయం సాధించాయి. మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం గీతాంజలి కాగా, ఈ సినిమా . నాగార్జున సినీ కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా నిలిచింది. సాధారణంగా మన తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్లు చనిపోతారంటే అంగీకరించం. కాని గీతాంజలి చిత్రం మాత్రం అనుమాలన్నింటిని పటాపంచలు చేసింది. సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇందులో హీరో, హీరోయిన్స్ చనిపోతారని వారికి ముందే తెలుసు. అయినప్పటికీ వారి మధ్య చిగురించిన ప్రేమను ఎంతో అందంగా తెర మీద చూపించి.. ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించి అందరి ప్రశంసలు పొందాడుమణిరత్నం. ఈ మూవీ ద్వారా తెలుగు తెరకు గిరిజ పరిచయం అయింది ఈ సినిమాతో గిరిజ దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఫస్ట్ సినిమాతోనే ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం వరుస అవకాశాలు క్యూ కట్టడం జరిగింది. మలయాళంలో వందనంలో నటిస్తే అది కూడా సూపర్ హిట్. బాలీవుడ్‌లోను నటించింది. అయితే ఆమె కోసం కొన్ని ఎక్స్‌పోజింగ్ సీన్‌లు క్రియేట్ చేశారట. దాంతో గిరిజ.. వాటిల్లో నటించడానికి ససేమీరా అని చెప్పింది.
అప్పుడు ఆమెను నిర్మాతలు బెదిరించడంతో కోర్టుని ఆశ్రయించింది. కాంట్రాక్ట్‌కు భిన్నంగా ఎక్స్‌పోజింగ్ సీన్లలో నటించమని తన మీద ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించడంతో కోర్టు సదరు నిర్మాతకు మొట్టికాయలు వేసి.. పరిహారం చెల్లించాలని ఆదేశింశించింది. ఆ ఘటన తర్వాత గిరిజ మీద కక్ష పెంచుకున్న నిర్మాత.. ఆమెను సినిమా నుంచి తొలగించారు. ఆమీర్‌ఖాన్ కూడా అందుకు మద్దతు తెలిపాడు. దాంతో గిరిజ ప్లేస్‌లోకి ఆయేషా జుల్కా వచ్చింది. ఆ సినిమాలో ఆమె ఒక్క పాటలో మాత్రమే కనిపిస్తుంది. ఈ చేదు అనుభవం తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి బిట్రన్ వెళ్లింది. అయితే అలా తీసేయడం తనని ఏమి బాధపెట్టలేదంటుంది గిరిజ.