Garikapati : ఎన్‌టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన గ‌రిక‌పాటి

Garikapati : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి రూపొందించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ నిలిచింది. అయితే ట్రిపుల్ ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇక తాజాగా ఈ పాట గురించి గ‌రిక‌పాటి త‌న ప్ర‌వ‌చ‌నంలో ప్రస్తావించ‌డం విశేషం. అచ్చ తెలుగులో రాసిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం సంతోషించాల్సిన విషయమని చెబుతూ..ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి కూడా గరికపాటి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. నాకు మొన్న‌టి వరకు ఆ పాట గురించి తెలీదు.

ఆ పాట ఎందుకు ఆ రేంజ్‌కి వెళ్లిందో తెలుసుకోవ‌డానికి మా అబ్బాయి పిలిచి ఆ పాటేంటో పెట్టరా అని అరగంట కూర్చొని విన్నాను. ఇందులో ఇంగ్లిష్ మాటలు లేవు. అచ్చ తెలుగు పాట రాసిన చంద్రబోస్‌కి నమస్కారం. చాలా మంచి పాట రాశారు అని గరికపాటి ప్రశంసించారు. భగవంతుడి దయవల్ల మార్చి 13వ తేదీన పురస్కారం వస్తే మనంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరని గరికపాటి అన్నారు. ‘పురస్కారం రావాలని కాంక్షిద్దాం. సరస్వతీ దేవిని పూజిద్దాం. గుడిలోకి వెళ్తే దండం పెట్టండి పురస్కారం రావాలని. మనమంతా గర్వంగా తిరుగుతాం’ అని గరికపాటి తన అనుచరులకు తెలియ‌జేశారు.

Garikapati sensational comments on charan and ntr
Garikapati

ఇక ‘నాటు నాటు’ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్‌ను ఆకాశానికి ఎత్తేశారు. చిన్నవాళ్లు అయిన వారికి న‌మ‌స్కారం. ఇద్దరూ కూడబలుక్కుని నటన చేయడం ఏదైతే ఉందో కవలలై పుట్టినవారికి కూడా సాధ్యం కాదు. రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన మహానటులు ఇద్దరూ అటువంటి నటన చేశారంటే నా కంటే చిన్నవాళ్లైనా ఇద్దరికీ నమస్కారం చేస్తున్నాను’ అని గరికపాటి ఎంతో గొప్పగా వర్ణించారు అని చెప్పాలి. ఆ పాట నేను రాస్తానేమో కాని అంత ఎన‌ర్జీతో అయితే ఎగ‌ర‌లేను క‌దా అంటూ ఛ‌లోక్తులు విసిరారు అని గ‌రిక‌పాటి వ్యాఖ్యానించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago