Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో చాలా బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం మూడో విడత వారాహి యాత్ర జరుగుతుండగా, పవన్ కళ్యాణ్ .. వైసీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజువాక వారాహి విజయయాత్ర బహిరంగసభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “ఎన్నికల ముందు బుగ్గలు నిమురుతుంటే, కనిపించిన వారిందరికీ ముద్దులు పెడుతుంటే దేవుడొచ్చాడనుకున్నారు. జగన్ రెడ్డిని నమ్మారు. 151 సీట్లను ఇచ్చి దేవుడుకి దణ్ణం పెట్టారు. జగన్ పాలన మొదలయ్యాక ప్రజలకు అర్ధం అయింది అని జగన్‌ని తిట్టిపోసారు.
జగన్‌కు అదృష్టం అందలం ఎక్కిస్తే… బుద్ధి బురదలోకి లాక్కెళ్లింది. జగన్‌ను ప్రజలు మరో ఆరో నెలలు భరించక తప్పదు. జగన్ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు చూస్తూ ఉండక తప్పదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం మనసులో ఆ దెయ్యం మీద ఉన్న కోపాన్ని ఓట్ల రూపంలో వేసి తరిమికొట్టండి” అని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు.గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ వైజాగ్ లో సందడి చేస్తుండగా, ఆయనకి అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. అయితే పవన్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది పవన్ కళ్యాణ్ ఎయిర్ పోర్ట్ నుండి బయకు వస్తున్న సమయంలో ఓ వ్యక్తి తన పాపని ఎత్తుకోమని ఇచ్చాడు.
![Pawan Kalyan : పాపని ఎత్తుకోమన్న అభిమాని.. పవన్ అలా రియాక్ట్ అయ్యాడేంటి..! fan thrown his baby to Pawan Kalyan](http://3.0.182.119/wp-content/uploads/2023/08/pawan-kalyan-1-3.jpg)
అయితే అప్పటికే జనాలు పవన్ మీదమీదకు వస్తుండగా, పాపని జాగ్రత్తగా తండ్రికి ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ మధ్య ర్యాలిలో ఓ యువతి అలానే తన పాపని పవన్ కి అందించగా, ఆయన జాగ్రత్తగా తీసుకొని మళ్లీ అంతే జాగ్రత్తగా ఇచ్చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఇక పవన్ ఇప్పుడు ఓజీ అనే సినిమాతో కూడా సందడి చేయనున్నాడు. ఈ షూటింగ్ కూడా ఖాళీ సమయాలలో పూర్తి చేస్తున్నాడు.