Ex DSP Nalini : నళిని.. కొద్దిరోజులుగా ఈ పేరు చుట్టు తెగ చర్చ నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో.. తన డీఎస్పీ పదవికి రాజీనామా చేసి వార్తాల్లోకి ఎక్కింది నళిని. ఉద్యమ వాణిని వినిపించేందుకు పరకాల బైపోల్ బరిలోనూ నిలబడ్డారు. ఉద్యమ సమయంలో ఎంతో పేరు సంపాదించికున్న నళిని… ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆమె ప్రస్తావన పెద్దగా లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పోలీస్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా… నళినికి తిరిగి డీఎస్సీ ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదనే అంశంపై ఆరా తీశారు. పోలీసు ఉద్యోగం కుదరకపోతే… అదే స్థాయిలో ఉండే మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంలో నళినితో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అయితే తనకు తిరిగి ఉద్యోగం ఆఫర్ చేయటంపై మాజీ డీఎస్పీ నళిని స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై చూపిస్తున్న అభిమానానికి కళ్లు చెమ్మగిల్లుతున్నాయన్నారు. గతం ఒక రీల్‌లో తన కళ్ల ముందు కదలాడుతుందని చెప్పారు. తనకు తిరిగి ఉద్యోగం చేసే ఆసక్తి లేదని.. తనలోని డైనమిక్ ఆఫీసర్‌ని గతంలోనే హత్య చేశారని ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టు రాశారు.గౌరవనీయులైన సీఎం గారు.. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్ లా నా కళ్ల ముందు కదులుతుంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్ గా ‘ సోషల్ స్టిగ్మా ( మరక) ‘ను మోసాను. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏండ్లు చాలా ఇబ్బంది పెట్టింది.
ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, 2009 డిసెంబర్ 9న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. నాటి సీఎం రోశయ్య గారు మహిళ దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే ,నేను రాజీనామాను విత్ డ్రా చేసుకొని డిపార్ట్మెంట్ లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాకు సీఎం అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్లు నాకు సహాయం చేయకపోగా నన్ను ఎగతాళి చేశారు అని నళిని తన బాధని చెప్పుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…