Ex CM KCR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం బాత్‌రూంలో జారిపడగా, ఆయన తుంటి ఎముక ఫ్రాక్చర్ అయింది. దంతో ఆయనని యశోద ఆసుపత్రిలో చేర్పించి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యులు రెండో రోజున హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స శుక్రవారం విజయవంతంగా జరగ్గా.. ప్రస్తుతం ఆ గాయం నుంచి కేసీఆర్ మెల్లిగా కోలుకుంటున్నారు. 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలోనే కేసీఆర్ ఉండగా.. వైద్యులు ఆయనను నడిపించినట్లు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ప్రకారం సర్జరీ చేసిన 12 గంటల్లోగా నడిపించాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. వైద్యం అందిస్తున్న ఆర్థోపెడిక్ నిపుణుల సమక్షంలోనే కేసీఆర్‌ను నడిపించినట్లు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సంతృప్తిగా ఉన్నట్లు యశోద ఆసుపత్రి వైద్యుల బృందం హెల్త్ బులిటెన్‌లో వివరించింది. కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు కాలు జారిపడ్డారు. ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. యశోద వైద్యులు కేసీఆర్ కు సిటీ స్కాన్ సహా అనేక రకాల వైద్య పరీక్షలు చేశారు. సిటీ స్కాన్ లో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక భాగంలో ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించారు. అయితే ఆయనకి ప్రమాదం జరిగిందని తెలిసినప్పుడు ఆసుపత్రికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
స్ట్రెచర్‌పై తన భర్తని అలా చూసి కేసీఆర్ భార్య తెగ ఏడ్చేసింది. పక్కనే ఉన్న కవిత, కేటీఆర్ ఆమెని ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.మరోవైపు.. కేసీఆర్‌ను త్రిదండి చిన్న జీయర్ స్వామి.. యశోద ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం వైద్యులతో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చిన్న జీయర్ స్వామి ఆకాక్షించారు. అనంతరం అక్కడే ఉన్న కుటుంబ సభ్యులతో చిన్న జీయర్ స్వామి మాట్లాడి.. ధైర్యం చెప్పారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…