ETV Prabhakar : బుల్లితెర మెగాస్టార్‌గా మంచి పేరు తెచ్చుకున్న ప్రభాకర్ ఒకప్పుడు సీరియల్స్, టీవీ షోలతో అదరగొట్టేవాడు. ఇప్పుడు సినిమాలలో కూడా సందడి చేస్తున్నాడు. ప్రభాకర్ కు ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆఫర్లు వస్తున్నాయనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం “రాజు గారి కోడిపులావ్” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శివ కోన ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. నేను చేసింది చిన్న హెల్ప్ అని వీరంతా ఇంతలా పొగడడం ఆనందంగా ఉందని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా తమలాంటి వారందరినీ ఆదరించిన ప్రేక్షకులు ఈ యంగ్ అండ్ డైనమిక్ నటులను ఆదరించాలని కోరారు. ఇక డైరెక్టర్ శివ కోన గురించి మాట్లాడుతూ.. ఆయనకు విజన్ పాటు, ప్లానింగ్ కూడా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. ప్రతిభతో పాటు ఓపిక చాలా ఎక్కువ అని తెలిపారు.
కొన్నిసార్లు స్టార్ హోటల్స్ లో బిర్యాని తిన్నదానికన్నా మామూలుగా హోటల్స్ లో తిన్న బిర్యాని చాలా రుచిగా బాగుంటుందని, అలాగే రాజు గారి కోడి పులావ్ కూడా మీకు నచ్చుతుందని తెలిపారు. చిన్న సినిమాను విడుదల చేయడం అంత ఆశామాశి వ్యవహారం కాదని ఈ విషయంలో శివకోన చాలా నేర్పుగా వ్యవహరించాలని అందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ప్రొడక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. నా కొడుకుని పెట్టి సినిమా తీసా. డబ్బులు అన్నీ ఎటో వెళ్లపోయాయి. కాని వారు జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారని అన్నాడు ప్రభాకర్. ఇక ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా రెండు మూడు సినిమాలు ప్రారంభమవుతున్నట్టు కొన్ని నెలల క్రితం ప్రకటనలు వెలువడ్డాయి.అయితే ఈ మధ్య కాలంలో చంద్రహాస్ సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు.
https://youtube.com/watch?v=tqa3fd_DCuo