Ester : టాలీవుడ్‌లో ఎంతో మంది ప్రముఖులు ప్రేమ వివాహాలు చేసుకొని ఒక్కటవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే సింగర్ కమ్ యాక్టర్ నోయల్ సీన్ – హీరోయిన్ ఎస్తర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లైన ఆరు నెలలకే విడిపోయిన ఈ జోడీ.. తమ విడాకులకు కారణం ఏంటి అనే దానిపై ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంటుంది.హీరోయిన్ ఎస్తర్’1000 అబద్దాలు’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఇందులో సునీల్‌తో కలిసి నటించిన ‘భీమవరం బుల్లోడు’ చిత్రం మాత్రమే మంచి పేరును తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘గరం’, ‘జయ జానకి నాయక’ వంటి కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. కానీ, అవేమీ ఆమెకు పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు.
అయితే ఇటీవల ఎస్తర్ పలు ఇంటర్వ్యూలలో విడాకులకి సంబంధించి అనేక విషయాలు షేర్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే పెళ్లైన 16 రోజులకే నోయల్ నిజస్వరూపం తెలుసుకున్నా. అందుకే అతడి నుంచి విడిపోవాలని డిసైడ్ అయిపోయా. ఈ క్రమంలోనే అంత త్వరగా విడాకులు తీసేసుకున్నా’ అంటూ వెల్లడించింది. ‘నాతో విడిపోయాక నోయల్ నాపై చెడు ప్రచారం చేశాడు. బిగ్ బాస్ షోలో తనపై సింపతీ వచ్చేలా మా విడాకుల ఇష్యూను వాడుకున్నాడు. దీంతో ప్రేక్షకుల్లో సానుభూతి పొందాలని ప్రయత్నాలు చేశాడు. అప్పుడే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని నాకు అనిపించింది. కానీ, దీనిపై నాకు మాట్లాడాలని అనిపించలేదు’ అని చెప్పింది.
2019 జనవరి 3న నోయల్, నేను పెళ్లి చేసుకున్నాము. ఆ తరువాత కొద్ది రోజులకే మా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అప్పటి నుంచి దూరంగా ఉంటున్నాము. జనవరిలో పెళ్లి కాగా.. జూన్‌లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. అయితే వాయిదాల అనంతరం మా విడాకులపై కోర్టు తీర్పు నిన్న వచ్చింది. అయితే నేను అతనితో విడిపోవాలనే నిర్ణయానికి ఎందుకు వచ్చానో అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. మీ మద్దతు ఇంతకు ముందులాగే ఉంటుందని ఆశిస్తున్నా.. ఒక బంధాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు.. మా ఇద్దరి రిలేషన్‌పై ఇదే నా క్లారిఫికేషన్. ఎంతైనా మనం మనుషులం. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటాం అని భావిస్తున్నా.. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. అని పేర్కొంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…