Eatala Rajender : ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతుంది. తెలంగాణ,కాంగ్రెస్,బీజేపీ వంటి పార్టీలు తెలంగాణలో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగినప్పటి నుంచి పరిస్థితి కొంతమేర మారింది. రాష్ట్ర ఇంచార్జీగా ఠాగూర్‌ను తీసేసి.. ఠాక్రేకు బరిలోకి దింపారు. అంతేకాదు పలు కీలక నియామకాలు చేశారు. ఇక కర్నాటకలో కాంగ్రెస్ విజయంతో.. తెలంగాణలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఆపేశారు. చేరికలు పెరిగాయి. రేవంత్ రెడ్డి పాదయాత్రతో జనంలోకి వెళ్లివచ్చారు. ఇటు భట్టి పాదయాత్ర ద్వారా పార్టీ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రియాంక గాంధీ కూడా ఓ సారి పబ్లిక్ మీటింగ్ అటెండ్ అయ్యి వెళ్లారు. ఇలా తెలంగాణ కాంగ్రెస్ ఉరకలెత్తే ఉత్సాహంతో పరుగులు తీస్తుంది.
కాంగ్రెస్ -షర్మిల మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్న నేపధ్యంలో తెలంగాణలో జోరుగా చర్చలు సాగుతున్నాయి.. ఈ క్రమంలోనే ఇరు పక్షాల నుంచి కీలక ప్రకటన దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. షర్మిల టచ్‌లో ఉన్నారని రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రే ఇప్పటికే ప్రకటించారు. అయితే పొత్తా, వీలీనమా అన్నది త్వరలోనే తేలిపోనుంది. ఇక ఈటల రాజేందర్ సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు అనిపిస్తుంది. ఆయన ప్రస్తుతం బీజేపీకి అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రనాయకత్వం తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల.. పొంగులేటిని బీజేపీలోకి ఆహ్వానించడానికి వెళితే.. తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇచ్చారని ఆఫ్ ద రికార్డ్ వ్యాఖ్యానించారు.
![Eatala Rajender : కాంగ్రెస్‌లో చేరికపై తేల్చేసిన ఈటల.. ఏమన్నారంటే..? Eatala Rajender given clarity on congress party joining](http://3.0.182.119/wp-content/uploads/2023/06/eatala-rajender.jpg)
అయితే ఈటలని బుజ్జగించేందుకు ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి ఫోన్ వచ్చినా.. ఆయన వెళ్లేందుకు ఆసక్తి కనబరచలేదని తెలిసింది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఆయనకు పొసగడం లేదని అర్థం అవుతుంది. బీజేపీ మాత్రం బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈటల మనసు కాంగ్రెస్ వైపు లాగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు 5 నెలల ముందుకు కాంగ్రెస్‌కు అన్ని రకాలుగా కలిసి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని తెలుస్తుంది. ఇక అచ్చంపేట, మాసాయిపేట, హకీంపేటలో పేద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వందల ఎకరాలు రూ.6 లక్షలలోపే కొన్నానని స్వయంగా అంగీకరించిన ఈటల రాజేందర్ బ్రోకర్ కాక మరేమి అవుతారని ప్రశ్నించారు.