Dr YS Rajashekhar Reddy : ప్రస్తుతం ఏపీలో రాజకీయ వాతావరణం ఎంత వాడివేడిగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చంద్రబాబు, నారా లోకేష్‌లకి జగన్ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకి ఇంకా బెయిల్ రాలేదు. మరోవైపు నారా లోకేష్ అరెస్ట్‌కి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్ వ్యవహారంపై 2022 ఏప్రిల్‌లో నమోదుచేసిన కేసులో ఏ14గా లోకేష్ పేరును సీఐడీ ఇటీవల చేర్చింది. దీంతో సిఐడి అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది.
హైకోర్టులో లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేశ్‌కు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇస్తామని.. దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్ ప్రస్తావన రానందున.. ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి సురేష్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు నారా లోకేష్‌కు నోటీసులివ్వడానికి సిఐడి ప్రత్యేక బృందాలు ఢిల్లీ వెళ్లాయి. దీంతో సిఐడి ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విచారణకు సహకరించాల్సిందేనంటూ లోకేష్‌కు కోర్టు తేల్చి చెప్పడంతో తర్వాత పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
అయితే నారా లోకేష్ అరెస్ట్ కూడా త్వరలోనే ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన పేరు తెగ మారు మ్రోగిపోతుంది. ఆ నాడు లోకేష్ పేరు అసెంబ్లీ వైఎస్సార్ ప్రస్తావించిన వీడియో వైరల్‌గా మారింది. వైఎస్సాఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చినప్పుడు.. ఆయన పక్కన చంద్రబాబు, సత్యం రామలింగరాజు కూర్చున్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జార్జి బుష్ రాగా, అప్పుడు ఆయన పక్కన డ్వాక్రా మహిళలని కూర్చోపెట్టాను. చంద్రబాబు మైండ్ సెట్, నా మైండ్ సెట్ తేడా అది. నా కొడుకు అమెరికా వెళ్లినప్పుడు హోమ్ సిక్ తో వచ్చేసాడు. లోకేష్ అమెరికాలో ఉన్నప్పుడు సత్యం రామలింగరాజు కొడుకులకి రూమ్ మేట్ అవునా కాదా అంటూ వైఎస్సార్ ప్రశ్నించారు. ఆ సమయంలో చంద్రబాబు నోట మాట రాలేదు.