Doctor BS Rao : శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకులు, చైర్మన్ బీఎన్ రావు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇంట్లోని బాత్రూమ్‌లో కాలు జారి కింద పడటంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. బీఎస్ రావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రాకు చెందిన బీఎన్ రావు దంపతులు.. ఇంగ్లండ్, ఇరాన్‌లో వైద్యులుగా సేవలించారు. ఆ తరువాత పుట్టిన గడ్డకు వచ్చి.. 1986లో శ్రీ చైతన్య విద్యాసంస్థలను స్థాపించారు.
తొలుత విజయవాడలో గర్ల్స్ జూనియర్ కాలేజీని స్థాపించిన బీఎన్ రావు.. అంచెలంచెలుగా కాలేజీలను విస్తరించారు. విజయవాడ నుంచి మొదలైన శ్రీ చైతన్య కాలేజీ ప్రస్థానం.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగానూ విస్తరించింది. ప్రస్తుత దేశ వ్యాప్తంగా 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూల్స్, 107 సీబీఎస్‌ఈ స్కూల్స్ ఉన్నాయి. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో దాదాపు 8.50 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒకానొక సమయంలో తాను ఎలా విద్యావేత్తగా మారానన్న వివరాలను బీఎస్ రావు వెల్లడించారు. తాను ఇరాన్‌లో పని చేస్తున్న సమయంలో భారత్‌కు వచ్చి తన కుమార్తెల విద్య కోసం ఓ మంచి కాలేజీ కోసం వెతికాననని.. ఆ క్రమంలోనే బాలికల కోసం ప్రత్యేకించి కళాశాలలు తనకు కనిపించలేదని బీఎస్ రావు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
పదో తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యకు వచ్చేసరికి సరైన ప్రతిభ కనబరచలేకపోవడం కూడా తాను విద్యా సంస్థ ఏర్పాటు చేసేందుకు మరో ప్రేరణ కలిగించిందని బీఎస్ రావు అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు శిక్షణా సంస్థను స్థాపించగా.. అనతి కాలంలోనే తమ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులు ఐఐటీ, నీట్‌లలో మంచి ర్యాంకులు సాధించాయని అన్నారు. 2006లో హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఐఐటీ- జేఈఈ, ఏఐఈఈఈ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే అమెరికాలో ఉన్న తన కుమార్తెలు సీమా, సుష్మా భారత్‌కు వచ్చి తన తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ చైతన్య విద్యా సంస్థలను దేశ వ్యాప్తంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…