Pushpa Movie : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ మూవీ డైలాగ్స్‌ను ప్రజలు చెబుతుంటారు. పుష్ప డైలాగ్స్‌తోపాటు డ్యాన్స్ కూడా చాలా ఫేమస్ అయింది. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయగా.. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పుష్ప మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే ఆయన పక్కన రష్మిక మందన్న కూడా అద్భుతంగా నటించింది.
ఇక ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా ఫహాద్ ఫాసిల్ నటన అద్భుతమనే చెప్పాలి. అలాగే విలన్ పాత్రలో సునీల్, ఆయన భార్యగా అనసూయ అదిరిపోయేలా నటించారు. అయితే పుష్ప సినిమాను వాస్తవానికి పలువురు హీరోలు వదులుకున్నారట. తరువాతే ఈ మూవీ కథ అల్లు అర్జున్ చేతికి వచ్చింది. ముందుగా ఈ మూవీని సుకుమార్ హీరో మహేష్ బాబుతో చేద్దామని స్టోరీ వినిపించారట. కానీ ఈ కథ తనకు సెట్ అవదని చెప్పడంతో సుకుమార్ ఈ మూవీని పలువురు హీరోలకు వినిపించారట. కానీ అందరూ తిరస్కరించారట. దీంతో అల్లు అర్జున్ కు ఈ మూవీ కథ చెప్పగా దీనికి బన్నీ వెంటనే ఓకే చెప్పారట. దీంతో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ పుష్పను తెరకెక్కించారు.
ఇక ఈ మూవీకి గాను ముందుగా పలువురు యాక్టర్లను అనుకున్నప్పటికీ వారు కూడా మారిపోయారు. రష్మిక మందన్నకు బదులుగా ఇంఉలో సమంతను అనుకున్నారట. అలాగే సమంత నటించిన పాట కోసం ముందుగా దిశా పటాని, నోరా ఫతేహిలను అనుకున్నారట. అదేవిధంగా విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని అనుకున్నారట. ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాల్సి ఉంది. కానీ డేట్స్ అడ్జస్ట్ కాలేదు. దీంతో ఆయన పుష్పను వదులుకున్నారు. తరువాత పోలీస్ ఆఫీసర్ పాత్రను బెంగాలీ నటుడు జిష్ణు సేన్ గుప్తా, టాలీవుడ్ హీరో నారా రోహిత్‌లు కూడా వదులుకున్నారు. ఆ తరువాతే మళయాళ నటుడు ఫహాద్ ఫాసిల్‌ను దీనికి ఎంపిక చేశారు. ఇలా పుష్ప సినిమాకు ముందుగా అనుకున్న పలువురు నటులు మారిపోయారు. అయినప్పటికీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడం విశేషం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…