Student No. 1 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి సూపర్ హిట్ చిత్రం స్టూడెంట్ నెం 1. అటు దర్శకుడిగా జక్కన్నకు.. ఇటు హీరోగా ఎన్టీఆర్‌కు ఈ సినిమా మంచి విజయం తెచ్చిపెట్టింది. ఈ కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన కూడా లభించింది. అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి ముందుగా అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదట. మరో హీరోను అనుకున్నట్టు ఇటీవల నిర్మాత చలసాని అశ్విని దత్ ప్రముఖ షో ఆలీతో సరదాగాలో పాల్గోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘స్టూడెంట్ నెం.1’ సినిమాను 2001లో నిర్మాత అశ్వనీదత్ అనుకున్నప్పుడు తొలుత ప్రభాస్‌తో చేయాలని అనుకున్నారట. అంటే ఆ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్‌కి పరిచయం చేద్దామని ,ఆ దిశగా చర్చలు సాగుతున్న సమయంలో అశ్వనీదత్‌కు హరికృష్ణ నుండి ఫోన్ వచ్చిందట. దీంతో అశ్వనీదత్ ఆలోచన మారిందని, ఇక ఆ సినిమా అటు తిరిగి, ఇటు తిరిగి ఎన్టీఆర్ దగ్గరకు వచ్చిందట. అలా ఆ సినిమాలో ప్రభాస్‌ను కాదని, ఎన్టీఆర్‌ను తీసుకున్నామని అశ్వనీదత్ చెప్పారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించగా.. 2001లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రం తమిళంలో అదే టైటిల్‌తో 2003లో రీమేక్ అయ్యింది.
స్టూడెంట్ నెం 1 చిత్రం ఎన్టీఆర్‌లోని చాలా యాంగిల్స్‌ని బయటపెట్టింది. స్టూడెంట్ నెం.1’ సినిమా పేరు చెప్పగానే.. వెంటనే మన కళ్ల ముందు ఎన్టీఆర్ డ్యాన్స్, తారక్ డైలాగ్స్, జూనియర్ ఎన్టీఆర్ నటన సాక్షాత్కరిస్తాయి. అంతలా ఆ సినిమాలో నట విశ్వరూపం చూపించాడు జూనియర్. ఇప్పటికీ ఆ సినిమా వస్తే టీవీ స్క్రీన్ల ముందు నిలిచిపోయే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. అంత కంటే ఎక్కువగా ఆ సినిమాలో ఎన్టీఆర్‌ను అభిమానిస్తుంటారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమాని ప్రభాస్ చేసి ఎలా ఉండేదో అని ఫ్యాన్స్ ఆలోచనలు చేస్తున్నారు.