సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం కాంతార. ఈ చిత్రం ఇంటా బయటా కూడా భారీ లాభాలు అందిపుచ్చుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటుంది.కన్నడలో చిన్న సినిమాగా మొదలైన కాంతారా ప్రభంజనం ఇపుడు తెలుగుతో పాటు ఉత్తారాది ప్రేక్షకులను కూడా ఫిదా చేస్తోంది. అక్కడ ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. తాజాగా ఈ సినిమాను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ వీక్షించి అద్భుతం అంటూ కితాబు ఇచ్చారు. కాంతారా మూవీని నిర్మల సీతారామన్ బెంగళూరులోని మల్టీప్లెక్స్‌లో వీక్షించారు. ఈ సినిమాను చూసిన నిర్మల సీతారామన్ దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టిని ఫోన్‌లో ప్రత్యేకంగా అభినందించారు.
రిషబ్ శెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే కాక ఇందులో ప్రధాన పాత్ర తానే పోషించారు. అయితే ముందుకు ఈ సినిమాకి పునీత్ రాజ్ కుమార్‌ని అనుకున్నాడట రిషబ్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదట ఈ సినిమా స్టోరీని తాను పునీత్ రాజ్ కుమార్ గారికి వినిపించానని అయితే అప్పట్లో ఆయన వరుసగా ఇతర సినిమాల షెడ్యూల్ తో బిజీగా ఉండటంతో చేయలేకపోయాను. అయితే ఆ మట్టి వాసన బాగా పండాలంటే.. హీరోగా నువ్వే నటించాలి అని పునీత్ సలహా ఇచ్చాడట . ఈ సినిమా టేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని కూడా ఆయన అన్నారని రిషబ్ తెలియజేశాడు.
పునీత్ కనుక ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చి ఉంటే కథ మరోలా ఉండేది. ‘కాంతార’ కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైంది. తొలి రోజునే అక్కడ ఆ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను చూడటంతో, 15 రోజుల తరువాత తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేశారు. ‘కేజీఎఫ్’ సినిమాను నిర్మించిన బ్యానర్ కావడంతో, ఇతర భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి బడా సంస్థలు పోటీ పడ్డాయి. ఏ భాషలో విడుదల చేస్తే ఆ భాషలో ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇంతవరకూ ఈ సినిమా 300 కోట్లకి పైగా వసూళ్లను సాధించినట్టుగా, తాజాగా ఈ సినిమా టీమ్ అధికారిక పోస్టర్ ను వదిలింది.