Anchor Pradeep : బుల్లితెరపై ఎంతో మంది యాంకర్స్ సందడి చేస్తున్నారు. సహజంగానే మనకు యాంకర్ అనగానే.. సుమ, అనసూయ, శ్రీముఖి వంటివారు గుర్తుకు వస్తారు. కానీ మగ యాంకర్లు కూడా ఉన్నారు. అందులోనూ మగ యాంకర్‌ల పేర్లు చెబితే.. మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు.. ప్రదీప్. ఆయన యాంకరింగ్ ఎంతో బాగుంటుంది. అయితే ఒక చానల్‌లో వివాదాస్పద షో చేసి అనవసరంగా విమర్శల పాలయ్యాడు. కానీ ప్రదీప్ యాంకరింగ్ బాగుంటుందని అందరూ చెబుతుంటారు. ఇక ప్రదీప్ యాంకర్ కాక ముందు ఏం చేసేవాడో ఇప్పుడు తెలుసుకుందాం.
యాంకర్ గా తనదైన శైలిలో ముందుకు దూసుకు వెళుతున్న యాంకర్ ప్రదీప్ ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసుకుందాం. ప్రదీప్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఈవెంట్ మేనేజర్ గా పనిచేశాడు. ఆ తర్వాత రేడియో మిర్చి లో జాకీగా చేస్తూ అవకాశాల కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో ఒక లోకల్ ఛానల్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ అవకాశం ప్రదీప్ జీవితాన్నే మార్చేసింది. ఫిమేల్ యాంకర్స్ హవా ఉన్న సమయంలో ఎంట్రీ ఇచ్చి మరీ తానేమిటో నిరూపించుకున్నాడు ప్రదీప్.
జీ తెలుగులో ప్రసారం అయిన గడసరి అత్త సొగసరి కోడలు అనే మహిళల షో ద్వారా బుల్లితెరకి యాంకర్ గా ప్రవేశించాడు. ఆ కార్యక్రమాన్ని హిట్ చేయటంలో తన వంతు పాత్రను సక్సెస్ చేయటంతో ఆ కార్యక్రమం సూపర్ హిట్ కావటమే కాకుండా ప్రదీప్ కి సమయం లేకుండా బిజీ అవకాశాలు ఇప్పించింది. ఒక మహిళా షో కి మొదటిసారిగా మేల్ యాంకర్ యాంకరింగ్ చేసి మహిళల చేత శభాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఇక ప్రదీప్ వెనుదిరిగి చూడవలసిన అవసరం లేకపోయింది.
అడపా దడపా సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలను వేస్తున్నాడు. ప్రదీప్ నిర్మాతగా కూడా మారి జీ తెలుగులో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అంటూ సక్సెస్ గా ముందుకు సాగాడు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా మొదటి ప్రిఫరెన్స్ బుల్లితెరకే అని చెబుతున్నాడు ప్రదీప్.