నందమూరి నటసింహం బాలయ్యకు ఉన్న మాస్ ఫాలోయింగ్ వేరే. ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్లు వేరే. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయన టాప్ హీరోగా ఉన్నాడు. బాలయ్య ఫ్యాక్షన్ సినిమాలంటే బాలీవుడ్ జనాలు సైతం ఎంతో ఎంజాయ్ చేస్తారు. అందుకే బాలయ్య నటించిన సినిమాలను హిందీలో డబ్ చేస్తే మిలియన్స్ లో వ్యూవ్స్ వస్తాయి. అంతేకాకుండా టాలీవుడ్ లో ఫుల్ లెన్త్ పక్కా ఫ్యాక్షన్ సినిమా వచ్చింది కూడా బాలయ్య హీరోగానే. సమరసింహారెడ్డి సినిమాతో బాలయ్య అసలైన ఫ్యాక్షన్ రుచిని టాలీవుడ్ కు చూపించాడు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందించారు.
అంతే కాకుండా ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించారు. సమరసింహారెడ్డి కి ముందు బి.గోపాల్ వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్నాడు. అలాంటి సమయంలో విజయేంద్రప్రసాద్ ఒకరోజు బి.గోపాల్ ఇంటికి వెళ్లారు. మీకు చాలా నచ్చిన సినిమా ఏంటని బి.గోపాల్ ను అడిగారట. దానికి బి. గోపాల్ గుండమ్మ కథ అని ఆన్సర్ ఇచ్చారు. అంతే కాకుండా గుండమ్మ కథ సినిమాకు హిందీ సినిమా దుష్మన్ కలిపితే బాగుంటుందని అన్నారట. దీంతో ఐడియా చాలా బాగుందని తనకు ఒక వారం సమయం కావాలని విజయేంద్రప్రసాద్ వెళ్లిపోయారట. ఇప్పుడు ఆ రెండు సినిమాలను కలపడం ఎలా అనే ఆలోచనలో పడ్డారు.
ఆ తరవాత కథ రాసుకుని చెప్పినట్టే బి.గోపాల్ కు కథను అందించారు. కొన్ని సీన్లను విజయవాడలో నిజంగా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తీసుకున్నారు. ఇక ఈ కథను చెన్నైలో ఉన్న బాలయ్య వద్దకు విజయేంద్రప్రసాద్, బి.గోపాల్ వెళ్లి చెప్పారట. కథ విన్న తరవాత బాలయ్య తనకు 2 రోజులు సమయంలో కావాలని చెప్పడంతో విజయేంద్ర ప్రసాద్ లేచి వెళ్లిపోయారట. కానీ బి.గోపాల్ సినిమా గురించి పలు విషయాలు చెప్పి ఒప్పించారు. అలా సమరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టాలీవుడ్, బాలీవుడ్ కు మొదటిసారి ఫుల్ లెన్త్ ఫ్యాక్షన్ రుచి చూపించారు.