Security : భారతదేశంలో రాజకీయ నేతలు, ప్రముఖులకు సాధారణంగా జడ్ ప్లస్, జడ్, వై, వై ప్లస్, ఎక్స్ కేటగిరీల భద్రత ఉంటుండడం మనం చూస్తూ ఉంటాం. ఈ సెక్యూరిటీ సాధారణంగా కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖ నేతలు, సీనియర్ అధికారులు ఉంటారు. అలాగే భారత నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా, ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవాలకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పటి వరకూ ఆర్మీ చీఫ్‌కు మాత్రమే జడ్ ప్లస్ భద్రత ఉండేది. తాజాగా నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లను కూడా ఈ జాబితాలో చేర్చుతున్నామని కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణానికున్న ముప్పు ఆధారంగా పలు కేటగిరీల్లో కేంద్ర భద్రతా బలగాలు, పోలీసులు, ప్రభుత్వాలు సెక్యూరిటీని కల్పిస్తాయి. వీటిని ఆరు విభాగాలుగా విభజించారు.
ఎస్‌పీజీ, జెడ్ ప్లస్, జెడ్, వై ప్లస్, వై, ఎక్స్ కేటగిరీల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. స్పెషల్ పోలీస్ గ్రూప్, డిల్లీ పోలీస్, ఐటీబీపీ(ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్), సీఆర్‌పీఎఫ్(సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్) , ఎన్ఎస్‌జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ పోలీస్ ఫోర్స్) లకు చెందిన భద్రతా బలగాలు ఆయా కేటగిరీల్లో సెక్యూరిటీ అందిస్తాయి. దేశ ప్రధానికి ఎస్‌పీజీ సెక్యూరిటీ ఉంటుంది. జెడ్ ప్లస్ కేటగిరీ విభాగంలో భద్రత పొందే వారికి పది మంది ఎన్ఎస్‌జీ కమాండోలు సహా 56 మంది భద్రతా బలగాల బృందం 24 గంటలూ రక్షణ కల్పిస్తుంది. దేశంలో దాదాపు 63 మందికి ప్రస్తుతం ఈ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత పొందుతున్నారు.
ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర కేబినేట్ సభ్యులు, కొందరు సీఎంలు మాత్రమే ఈ కేటగిరీ భద్రత పొందుతారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమంది ఇతరులు కూడా ఈ కేటగిరీలో భద్రత పొందుతున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, హోమ్ మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి వారు ఈ లిస్టులో ఉన్నారు. వై ప్లస్ క్యాటగిరీ భద్రత విభాగంలో భద్రత పొందే వారికి కనీసం ఇద్దరు కమెండోలతో సహా 11 మందితో భద్రత కల్పిస్తారు. ముగ్గురు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతోపాటు మూడు వాహనాలు కేటాయిస్తారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎంపీ, నటి కంగనా రనౌత్ వంటి వారికి ప్రస్తుతం వై ఫ్లస్ క్యాటగిరీ భద్రత కల్పిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…