Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఈ మధ్య కాలంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. త్వరలో గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్నాడు. ఇటీవలే చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేసాడు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలు కూడా లైన్లో పెట్టాడు. ప్రస్తుతం చరణ్ కి నార్త్ లో కూడా బాగా ఫాలోయింగ్ పెరిగింది.అయితే రామ్ చరణ్‌కి ఖరీదైన కార్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే మనోడి దగ్గర చాలా కార్లు ఉన్నాయి. తాజాగా చరణ్ ఖాతాలో మరో ఖరీదైన కారు చేరింది.
రోల్స్ రాయిస్ కార్లు చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. చిరంజీవికి వైట్ కలర్ రోల్స్ రాయిస్ కారు ఉంది. అయితే తాజాగా రామ్ చరణ్ కూడా రోల్స్ రాయిస్ కార్ కొన్నాడు. రోల్స్ రాయల్ లేటెస్ట్ వర్షన్ స్పెక్ట్రా కారును చరణ్ కొన్నాడు. ఈ కారు ధర ఏకంగా 9 కోట్లు అని సమాచారం. అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్‌ల వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్లోబల్‌స్టార్ హీరో రామ్‌చరణ్ దంపతులు కూడా ముంబయి బయలుదేరి వెళ్లారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఇంటి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు సతీమణి ఉపాసన కుమార్తె క్లీంకారతో కలిసి రామ్‌చరణ్ తన కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టార్‌ను డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు.
దాదాపు రూ.9 కోట్లకు పైగా ఖరీదైన కారు ఇది కాగా, భారతదేశంలో ఉన్న రెండోది కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ విజువల్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ కారుని జనవరిలో రిలీజ్ చేశారు. చరణ్ గతంలో ఎప్పుడో బుక్ చేసినా ఇటీవలే ఈ కార్ డెలివరీ అయింది. ఎయిర్ పోర్టుకు కారును చరణ్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ రావడం విశేషం. మరోవైపు హైదరాబాద్ సిటీలో ఈ కారు ఫస్ట్ కస్టమర్ చరణ్ కావడం గమనార్హం.