Rajamouli : టాలీవుడ్ దర్శకులలో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడు రాజమౌళి. తెరపై అన్ని రసాలను సమపాళ్లలో రంగరించి చూపించి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతుంటాడు జక్కన్న. బాహుబలి సినిమాతో ఆయన స్థాయి ఇంటర్నేషనల్ రేంజ్‌కి వెళ్లింది. ఇక రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి దర్శకుడే కాదు నటుడు కూడా. ఆయన ఓ సినిమాలో బాల నటుడిగా కూడా వెండితెరపై కనిపించాడు . రాజమౌళి బాల నటుడి గా నటించిన సినిమా పేరు పిల్లనగ్రోవి. 1983 లో ఆ సినిమా షూటింగ్ జరిగింది.
పిల్లనగ్రోవి సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి వయసు 10 సంవత్సరాలు.ఈ సినిమా షూటింగ్ సజావుగానే జరిగిన పలు కారణాల వలన విడుదల కాలేదు. అందుకే రాజమౌళి బాలనటుడిగా నటించిన విషయం చాలా మందికి తెలియదు. 49వ యేట అడుగుపెట్టిన రాజమౌళి. 1973 అక్టోబర్ 10న జన్మించిన రాజమౌళి. ఎస్ ఎస్ రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి , దర్శకుడు కాకముందు పలు టీవీ సీరియల్స్‌కు దర్శకుడిగా పనిచేసిన రాజమౌళి ఆ తర్వాత స్టూడెంట్ నెం 1 సినిమాతో దర్శకుడిగా మారాడు.
దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో 12 చిత్రాలు మాత్రమే చేసిన రాజమౌళి ఎవరూ అందుకోలేని రికార్డ్స్ సెట్ చేశారు. బాహుబలి 2 విడుదలై ఐదేళ్లు అవుతున్నా ఆ మూవీ కలెక్షన్స్ టచ్ చేసే సినిమా రాలేదు అంటే మీరు నమ్మి తీరాల్సిందే. రాజమౌళి .. నాని హీరోగా నటించిన మజ్ను మూవీలో కనిపించారు. అలాగే రైన్ బో అనే సినిమాలో నటించారు. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఏదేమైన ఇండియన్ సినిమా కలలు కన్న 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి చూపించాడు ఈ దర్శకుడు. స్టూడెంట్ నెం.1 నుండి ఆర్ఆర్ఆర్ వరకు ప్రతి సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్‌గా ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ లతో భారీ మల్టీస్టారర్ చేసి భారీ సక్సెస్ అందుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…