Upasana Konidela : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని వివాహం చేసుకొని మెగా కోడలిగా మారింది ఉపాసన. ఆమె ఎప్పుడు చాలా కూల్ అండ్ కామ్‌గా ఉంటారు. అపోలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు మోస్తూ, సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ సత్తా చాటుతోంది ఉపాసన. అయితే ఉపాసన వార్షిక ఆదాయం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఉపాసన ఏడాదికి 30 కోట్ల రూపాయలను సంపాదిస్తారట. అయితే ఆమె సంపాదించిన సంపాదనను సామాజిక సేవ కార్యక్రమాలకు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు.
ఉపాసన 200 వృద్ధ, అనాథ ఆశ్రమాలను దత్తత తీసుకుని వాటి ఆలనా పాలనా చూస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఉపాసన ద్వారా చాలా మందికి ఆరోగ్య సూచనలు చేస్తూ.. సలహాలు ఇస్తూ ఉంటుంది .మూగజీవాలను దత్తత తీసుకొని వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టడం, మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు గ్రామీణ వైద్య సేవలు, వృద్ధాశ్రమాలకు సహాయం చేయడంలో ఈమె తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఎంత సంపాదించిన ఒదిగి ఉండే మనస్తత్వం ఉపాసనది. భర్తకి చేదోడు వాదోడుగా ఉంటూనే అనేక సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు పొందుతుంది ఉపాసన.
![Upasana Konidela : మెగా కోడలు ఉపాసన ఎంత సంపాదిస్తుందో తెలుసా..? do you know how much Upasana Konidela earns](http://3.0.182.119/wp-content/uploads/2022/09/upasana-konidela-2.jpg)
ఇక భర్త మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి లాగానే తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరోలలో ఒకరిగా దూసుకుపోతున్నారు. రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఆచార్యతో దారుణమైన ఫ్లాప్ మూటగట్టుకున్నారు. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఓ చిత్రం చేస్తుండగా, ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కూడా మంచి హిట్ అయితే రామ్ చరణ్ క్రేజ్ పీక్స్ లోకి వెళ్లడం ఖాయం. ఏదేమైన ఉపాసన, రామ్ చరణ్ జంట చూడముచ్చటగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.