మనం రోజూ వంటల్లో ఉప్పును వాడుతుంటాం. ఉప్పును వేసి అనేక రకాల కూరలను చేస్తుంటారు. ఏ వంటకం అయినా సరే ఉప్పుదే ప్రధాన పాత్ర. ఉప్పు లేకపోతే వంట పూర్తి కాదు. ఉప్పు లేకపోతే వంట రుచించదు. అయితే మీకు తెలుసా.. సైంటిస్టులు ఇటీవల చేసిన అధ్యయనం ప్రకారం.. మనం రోజూ తినాల్సిన దానికన్నా రెట్టింపు మోతాదులో ఉప్పును తింటున్నామట. అవును.. షాకింగ్ గా ఉన్నా ఇది నిజమే. ఇలా ఉప్పును అధికంగా తింటుండడం వల్ల అనేక రోగాలు వస్తున్నాయని కూడా వారంటున్నారు.
మనం రోజుకు 5 గ్రాముల వరకు ఉప్పును తినవచ్చు. ఆ మేర మనకు అది అవసరమే. అంటే ఒక టీస్పూన్ మోతాదులో ఉప్పును తినవచ్చన్నమాట. కానీ అధ్యయనాల ప్రకారం సుమారుగా 11 గ్రాముల మేర ఉప్పును తింటున్నామట. అంటే రోజుకు మనకు కావల్సిన దానికన్నా అది దాదాపుగా రెట్టింపు అని అర్థమవుతుంది. ఇలా ఉప్పును అధికంగా తింటుండడం వల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉప్పును అధికంగా తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో పాదాలు, చేతుల్లో నీరు వచ్చి చేరుతుంది. అక్కడ వాపులు వస్తాయి. ఫలితంగా వేలితో నొక్కితే లోపలికి పోతుంది. ఇలా గనక ఎవరికైనా జరుగుతుంటే వెంటనే ఉప్పును తినడం తగ్గించాలి. లేదంటే మానేయాలి.
ఇక ఉప్పును అధికంగా వాడితే సోడియం నిల్వలు శరీరంలో పెరగడం వల్ల దాన్ని బయటకు పంపడం కోసం కిడ్నీలు బాగా శ్రమించాల్సి ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో కిడ్నీలు చెడిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఉప్పును అధికంగా తీసుకుంటే వృద్ధాప్యంలో ఎముకలు పెళుసుగా మారిపోతాయి. చిన్న దెబ్బ తాకినా సులభంగా విరిగిపోతాయి. దీంతో మళ్లీ ఎముకలు అతుక్కుపోవడం కష్టమవుతుంది. అలాగే ఉప్పు వాడకం ఎక్కువైతే హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీంతోపాటు మైగ్రేన్ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. కనుక ఉప్పును అధికంగా వాడుతున్న వారు వెంటనే దాని వాడకాన్ని తగ్గించండి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…