Suriya Ghajini : కొన్ని సినిమాలు ప్రేక్షకులకి ఎప్పుడు మంచి వినోదాన్ని పంచుతూనే ఉంటుంది. ఈ సినిమా స్టోరీగాని, స్క్రీన్‌ప్లే గాని చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మతి మరుపు అనే కాన్సెప్ట్‌తో కమర్షియల్ సినిమా తీసి బ్లాక్‌బాస్టర్ సాధించొచ్చు అని ఏ.ఆర్ మురుగుదాస్ నిరూపించాడు. పేరుకు రీమేక్ సినిమానే అయిన మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి మురుగుదాస్ ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు. 12 మంది హీరోలు నో చెప్పిన కథతో ఓ హీరో సినిమా చేసి ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు సూర్య. ఆయనకి నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు సూర్య.
స్టార్ డైరెక్టర్ మురగదాస్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు . ఆయన చేసిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో గజినీ సినిమా ఒకటి. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. తమిళ్ భాషలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అలాగే కలెక్షన్స్ పరంగా దుమ్మురేపింది ఈ సినిమా. అలాగే హిందీలోనూ ఈ సినిమాను రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా కథ ముందు పలువురు హీరోలకు వినిపించారట మురగదాస్. ఏ.ఆర్ మురుగుదాస్ ముందుగా ఈ సినిమాను తెలుగు హీరోలతో తీయాలని మహేష్‌బాబుకు ఈ కథను చెప్పాడట. కానీ హీరో ఒంటి నిండా పచ్చ బోట్లతో కనిపించాలి అనడంతో మహేష్ ఈ కథను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత వెంకటేష్, పవన్ కళ్యాణ్‌లకు చెప్పాడట. కానీ వీరిద్దరు పలు కొన్ని కారణాలతో వదులుకున్నారట.
అనంతరం తమిళ నేటీవిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేసి కమల్‌కు చెప్పాడట మురుగదాస్. కానీ కమల్ కూడా నో చెప్పాడట. కమల్‌తో పాటు రజిని కాంత్, విజయ్ కాంత్, థలపతి విజయ్ ఇలా పలువురు స్టార్ హీరోలకు చెప్పాడట. అందరూ ఈ కథను రిజెక్ట్ చేశారట. చివరిగా తన మొదటి సినిమాకు ఛాన్స్ ఇచ్చిన అజిత్ దగ్గరకు వెళ్ళి కథ చెప్పాడట. అజిత్‌కు కథ బాగా నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అజిత్‌కు నిర్మాతకు మధ్య విభేదాలు వచ్చి సినిమాను మధ్యలోనే ఆపేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని తీయాలని బలంగా ఫిక్సయి అప్పుడప్పుడే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సూర్యకు ఈ కథను చెప్పాడట. ఆయన ఒప్పుకోవడం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకని 2005 సెప్టెంబర్ 29న సినిమా విడుదల కావడం, మూవీ బంపర్ హిట్ కొట్టడం జరిగింది.