Actor Kantha Rao : అన్ని ఆస్తులు ఉన్నా చివ‌రి రోజుల‌లో కాంతారావు అన్ని క‌ష్టాలు ప‌డ్డారా..?

Actor Kantha Rao : క‌త్తి కాంతారావు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కాంతారావు 400 సినిమాల్లో న‌టించాడు. కేవలం జానపద చిత్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటించిన పలు పౌరాణిక చిత్రాలలో ఆయన స్నేహితుడిగా కనిపించారు. ఎన్టీఆర్ సైతం నారదుడి పాత్రలో కాంతారావు నటన చూసి తాను ఆ వేషం వేయనని శపథం చేశారంటే… కాంతారావు ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. డబ్బు కోసం నిర్మాతలను అసలు ఇబ్బంది పెట్టని కథానాయకుడు కాంతారావు. అటువంటి హీరోను పరిశ్రమ పట్టించుకోకపోవడం ఆయన అభిమానులకు బాధ కలిగిస్తోంది.

కాంతారావు 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి మూలంగా హైదరాబాదులో ని యశోద హాస్పిటల్ లో రాత్రి గం 9.50 ని.లకు కన్నుమూశారు. ఇప్పుడు కాంతారావు ఫ్యామిలీ చాలా దీనావస్థలో ఉంది. ఆర్థికంగా చాలా దీనావస్థలో కాంతారావుగారి కుటుంబం ఉంది. అంత గొప్పగా ఎదిగి నిలిచిన రావు గారి కుటుంబం ఇప్పటికి అద్దె ఇంట్లోనే . ఆస్తులు లేవు.ఓ ఇంట‌ర్వ్యూలో కాంతారావు కూతురు సుశీల త‌న తండ్రికి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. మా నాన్న‌గారికి అప్ప‌ట్లోనే 400 ఎకరాలు ఉండేది. కొత్త సినిమా వ‌స్తే స్నేహితులతో క‌లిసి వెళ్లే వారు. ఆ డ‌బ్బు కోసం ఎక‌రం అమ్మేశారు. అప్పుడు ఎక‌రం ధర 1200.

do you know about Actor Kantha Rao net worth and these details
Actor Kantha Rao

ఇక నాన్న సినిమాల్లోకి వచ్చి .. నిర్మాతగా మారే సమయానికి ఒక 50 ఎకరాలు ఉండేవనుకుంటా. అప్పుడు సినిమాలు తీయడం వ‌ల‌న న‌ష్టాలు రావ‌డంతో వాటిని అమ్మేశారు. ఇక వాటిని అమ్మిన త‌ర్వాత అటువైపు సాగ‌ర్ కాలువ ప‌డింది. దాంతో రేట్లు పెరిగాయి. కాని అప్ప‌టికే చాలా భూమిని అమ్మేయ‌డంతో చాలా బాధ అనిపించింది. నాన్న ఆసుప‌త్రిలో ఉన్న‌ప్పుడు సినిమా వాళ్ల క‌న్నా అభిమానులు ఎక్కువ‌గా ఆదుకున్నారు. ఆయన ప్రాణం పోతున్నప్పుడు అందరం దగ్గరే ఉన్నాం. అమ్మని తాను జాగ్రత్తగా చూసుకుంటానని అన్నయ్య చెప్పినప్పుడు, ఆయన కళ్లవెంట నీళ్లు చెంప‌ల మీదుగా జార‌డం ఇప్పటికీ నేను మ‌ర‌చిపోలేను. మా అమ్మ అమాయ‌కురాలు కావ‌డంతో చివ‌రి రోజుల‌లో ఆమె గురించే ఎక్కువ‌గా బాధ ప‌డ్డారు అని సుశీల పేర్కొంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago