Director Harish Shankar : పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ మంచి విజయం సాధించారు . పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, జనసేన పార్టీ అభ్యర్థులు అందరు గెలిచారు.. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తారని, జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని ప్రస్తుతం ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పవర్ స్టార్ గెలుపుతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకూ అందరకూ పవర్ స్టార్ గెలుపును ఆస్వాదిస్తూ.. ట్వీట్ చేస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని ఇంటికి ఆహ్వానించి పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేశారు. పవన్‌పై పూల వర్షం కురిపించి ఆయనతో కేక్ కట్ చేయించారు.
పవన్ కళ్యాణ్‌కి ఇండస్ట్రీ నుండి చాలా మంది ప్రముఖులు విషెస్ తెలియజేశారు. పవర్ స్టార్ ను విష్ చేసిన వారిలో హీరోయిన్ కాజల్ కూడా ఉన్నారు. పిఠాపురం నుంచి మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కు కాజల్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్ కూడా ఈ విక్టరీ సందర్భంగా పవర్ స్టార్ ను విష్ చేశారు. ఎంతో కష్టపడి సాధించిన ఈ విజయానికి ఆయన శుభాకాంక్షలు చెప్పారు. అటు సాయి ధరమ్ తేజ్ కూడా పవర్ స్టార్ ను విష్ చేశారు. ఎవర్రా మనల్ని ఆపేది అంటూ.. ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. డైరెక్షర్ హరీష్ శంకర్ అయితే పవర్ స్టార్ ను విమర్షించినవారికి గట్టిగా కౌంటర్ వేస్తూ.. ట్వీట్ చేశారు. దత్త పుత్తుడు.. దత్త పుత్రుడు అన్నారు. దత్త పుత్రుడు కాదు.. దత్తాత్రేయపుత్తుడిగా విజయం సాధించి చూపించాడు అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.

హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ చిత్ర సెట్స్ లో పవన్ కళ్యాణ్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు. “భారీ విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ గారికి మిస్టర్ బచ్చన్ టీమ్ నుండి శుభాకాంక్షలు” అంటూ దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. మిస్టర్ బచ్చన్ సెట్స్ లో చిత్ర యూనిట్ బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ గతంలో ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా ప్రారంభమై ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకుంది.