Dil Raju : మ‌హేష్ బాబు సినిమాతో పోటీ ప‌డ‌వ‌ద్దు.. సంక్రాంతి పోటీపై దిల్ రాజు వివ‌ర‌ణ‌

Dil Raju : సంక్రాంతికి థియేట‌ర్ల ద‌గ్గ‌ర ఎంత పోటీ ఉంటుంది అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌తి సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు వ‌చ్చి ప్రేక్షకులని ఎంట‌ర్‌టైన్ చేస్తుండ‌గా , ఈ సంక్రాంతికి మాత్రం ఏకంగా ఐదు భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ స్టార్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యేందుకు ఇప్పుడు సిద్దం కావడం వివాదాస్పదంగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం, వెంకటేశ్.. సైంధవ్, రవితేజ.. ఈగల్, తేజ సజ్జా హనుమాన్, నాగార్జున నటిస్తోన్న నా సామిరంగ సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకుల‌ని అల‌రించ‌నున్నాయి.

అయితే ఐదు సినిమాలు ఒకేసారి వ‌స్తుండ‌డంతో థియేట‌ర్ల స‌ద్దుబ‌టు క‌ష్టంగా మారింది. అయితే నిర్మాతలెవరూ వెనక్కి తగ్గకపోవడంతో సంక్రాంతి సినిమాల వివాదంపై నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు స్పందించారు. సంక్రాంతి రేసు నుంచి రెండు సినిమాలు తప్పుకుంటే థియేటర్లు సర్దుబాటు చేయడం సులభం అవుతుందని అన్నారు. ఇప్పుడు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నవారికి ఆ తర్వాత సోలో రిలీజ్ డేట్ ఛాంబర్ తరఫున ఇస్తామని ఐదుగురు నిర్మాతలకు చెప్పినట్టు దిల్‌ రాజు వెల్లడించారు. గుంటూరు కారం నిర్మాతలు మినహా మిగతా నిర్మాతల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే అందరికీ లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Dil Raju what he said about mahesh babu movie
Dil Raju

సంక్రాంతికి ఐదు భారీ చిత్రాలు విడుదలైతే ఏ సినిమాకు న్యాయం జరగదని అన్నారు దిల్ రాజు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించనున్నట్లు తెలిపారు. ఇటీవలే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశామని, సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు దిల్‌ రాజు. . ఫిల్మ్ ఛాంబర్​లో ఆ ఐదు చిత్రాల నిర్మాతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు.గుంటూరు కారం నిర్మాతలు తప్ప మిగతా నలుగురు నిర్మాతల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే అందరికీ లాభదాయకంగా ఉంటుందని దిల్‌ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే చిత్ర నిర్మాతకు ఎలాంటి పోటీ లేకుండా సోలో తేదీ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని వివరించారు. సంక్రాంతికి ఐదు చిత్రాలు విడుదలైతే ఏ సినిమాకు న్యాయం జరగదన్న దిల్ రాజు, సినిమా విడుదల తేదీలపై చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago