Dil Raju Son : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆనతి కాలంలోనే స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. ఇప్పుడు స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేస్తూ మంచి విజయాలని అందిపుచ్చుకుంటున్నారు. అయితే దిల్ రాజు ఐదు పదుల వయస్సులో మరోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి దిల్ రాజు మొదటి భార్య అనితకు హన్షిత రెడ్డి అనే యువతి జన్మించారు. ఇదంతా 30 ఏళ్ల క్రితం విషయం. దిల్ రాజు మొదటి భార్య అనిత అనారోగ్యంతో బాధపడుతూ కొన్నేళ్ల క్రితం మరణించారు. ఆ తర్వాత కొన్నాళ్లు సింగిల్‌గానే ఉన్నారు. ఆ తర్వాత వైఘారెడ్డి అనే యువతిని చూసి, పెద్దల అంగీకారంతో పిల్లల ప్రోద్బలంతో వీరిరివురు ఒక్కటి కావడం జరిగింది.
దిల్ రాజు, వైఘారెడ్డి ప్రేమకు గుర్తుగా 9 నెలల క్రితం ఒక బాబు జన్మించాడు. దిల్ రాజు కొడుకుకు అన్వై రెడ్డి అని నామకరణం చేసారు. తన మొదటి భార్య పేరులోని మొదటి అక్షరం అ, రెండో భార్య పేరులోని మొదటి అక్షరం వై కలిసేలా దిల్ రాజు ఈ పేరును ఫిక్స్ చేశారని టాక్ . కొడుకు పుట్టడంతో దిల్ రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.లేటు వయస్సులో పెళ్లి చేసుకొని పిల్లలని కనడంపై దిల్ రాజుపై ట్రోల్స్ నడించాయి. దీనిపై దిల్ రాజు స్పందించారు. దిల్ రాజు మాట్లాడుతూ హన్షితా రెడ్డి కుమారుడికి ఇప్పుడు ఐదేళ్ల వయసు ఉందని కానీ తన కుమారుడికి 9 నెలలు మాత్రమే వయసు ఉందని చెప్పుకొచ్చారు.
తాను తన మనవడి దగ్గర ఉన్నప్పుడు ఒక తాత లాగా ఉంటానని తన కుమారుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఒక తండ్రి లాగా ఫీల్ అవుతానని చెప్పుకొచ్చారు. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యకరంగానే ఉన్న మనవడి కంటే నా కుమారుడు వయసు తక్కువ అనేది కాస్త ఆసక్తికరంగా ఉందంటూ ఆయన కామెంట్లు చేశారు. రీసెంట్‌గా దిల్ రాజు తన ఫ్యామిలీతో తిరుమల వెళ్లగా అక్కడ దిల్ రాజు కుమారుడి పిక్స్ ఫొటోగ్రాఫర్స్ కెమెరాలలో బంధించారు. ప్రస్తుతం పిక్స్ నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. తల్లి పోలికలతోనే ఉందని కొందరు చెబుతున్నారు. కాగా, దిల్ రాజు తన భార్య వైఘారెడ్డిని హీరోయిన్గా లాంచ్ చేయబోతున్నారని కొన్నాళ్ళు లేదు రచయితగా లాంచ్ చేయబోతున్నారని కొన్నాళ్లు రకరకాల ప్రచారాలు జరిగాయి. వాటిపై ఇంత వరకు ఆయన ఏమి స్పందించలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…