Dil Raju : మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లో ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా సెటైర్లు పేల్చారు. ఎంతసేపు సినిమా ఇండస్ట్రీ గురించి కాదు.. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, పేదవారికి కడుపు నింపేలా, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి ఆలోచిస్తే మంచిదన్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు పడతారన్నారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు ఏపీలో రచ్చ జరుగుతుంది. వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా చిరంజీవిపై దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం ఎలా ఉండాలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడీగాళ్లు సలహాలిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని.
జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడకూడదని సూచించారు. కేంద్రమంత్రిగా పనిచేసిన మీరు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏమీ చేశారని ప్రశ్నించారు. చిరంజీవి సలహాలు ఇవ్వాలనుకుంటే ముందు అయన తమ్ముడుకు ఇవ్వాలన్నారు. ఏపీలో ఇప్పుడు చిరంజీవి వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. చిరంజీవి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపైన మంత్రులు వరుసగా విరుచుకు పడుతున్నారు. తమ్ముడు కోసమే చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేసారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో చిరు ఫుల్ వీడియో విడుదలైంది. అది చూసి కొందరికి అసలు విషయం అర్ధమైంది.
అయితే చిరంజీవిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటే ఇండస్ట్రీ నుంచి బాసటగా ఒక్క గొంతు కూడా వినిపించకపోవడంతో మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.అయితే తాజా ఇష్యూపై తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు స్పందించారు. చిరంజీవి vs వైసీపీ మధ్య జరుగుతున్న ఇష్యూని దిల్ రాజు ముందు ప్రస్తావించగా.. ‘నేను చూడలేదు.. నేను వినలేదు’ అని సమాధానం ఇచ్చారు దిల్ రాజు. ‘‘మీరు వివాదాలు చేయాలని ప్రశ్నలు అడిగితే నేను ఆన్సర్ చెప్పను. ఈ ప్రెస్ మీట్ పెట్టింది జైలర్ గురించి. దాని గురించి మాట్లాడితే బాగుంటుంది అని అన్నారు. ఏ విషయంలో నైన స్ట్రాంగ్‌గా మాట్లాడే దిల్ రాజు ఇప్పుడు ఇలా సైలెంట్‌గా ఉండడం మాత్రం ఫ్యాన్స్‌కి ఆగ్రహం కలిగించింది.