Dil Raju : టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఆయన చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలని నిర్మిస్తూ మంచి హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల తన కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన అన్వై బర్త్ డే వేడుకలకు పలువురు సినీ ప్రముఖు హాజరయ్యారు. దిల్‌రాజు కుటుంబ సభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులు, మహేశ్ బాబు, వెంకటేశ్, గోపీచంద్, శ్రీలీల, రాశీఖన్నా, సురేష్ బాబు, త్రివిక్రమ్, వక్కంతం వంశీ తదితరులు ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు.
వేడుకకి హాజరైన సెలబ్స్ ..అన్వైను ఆశీర్వదించారు. కాగా తన కుమారుడి బర్త్‌డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రూపొందించారు దిల్‌రాజు. ఇందుకోసం మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రత్యేకంగా ఓ పాటను కూడా కంపోజ్ చేశాడు. ప్రముఖ సింగర్ కార్తిక్ ఈ పాటను ఆలపించారు. ఇటీవలే యూట్యూబ్‌లోకి వచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దిల్ రాజు, ఆయన సతీమణితో పాటు కుటుంబ సభ్యులు అన్వైతో సరదాగా గడిపిన క్షణాలను ఈ వీడియోలో మనం చూడవచ్చు. ముఖ్యంగా దిల్‌రాజు తనయుడిపై మనవడు నీళ్లు పోస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మూడేళ్ల క్రితం తేజస్విని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి గతేడాది అన్వై అనే జన్మించాడు. దిల్ రాజు నివాసంలో ఆయన కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా దిల్‌రాజు సతీమణి 2017లో కన్నుమూశారు. ఆ తర్వాత 2020లో తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారాయన. వీరికి 2022 జూన్ 29న అన్వై పుట్టాడు. ఇటీవల బలగం సినిమాతో మంచి హిట్ అందుకున్న దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మిస్తున్నారు . ఇందులో ఎస్ జే సూర్య విలన్‌గా కనిపించనున్నారు. అంజలి, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…