Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు 2017లో తన సతీమణి అనితని కోల్పోయిన విషయం తెలిసిందే. సతీమణి మరణం తర్వాత దిల్ రాజు కొన్ని రోజుల పాటు ఒంటరిగా ఉన్నారు. అయితే కరోనా టైంలో దిల్ రాజు తేజశ్విని అనే మహిళని రెండో వివాహం చేసుకున్నారు. ఈ జంటకి గత ఏడాది ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఆ కొడుకి అన్వై అనే పేరు పెట్టారు. 2020లో దిల్ రాజుకి తేజస్వినితో వివాహం జరగగా.. 2022లో ఈ జంటకి కొడుకు జన్మించాడు. దిల్ రాజు అదృష్టవంతులు అని.. ఒకేసారి మనవళ్లు, కొడుకుతో ఆడుకునే అదృష్టం దక్కింది అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు.
ఇక దిల్ రాజు రీసెంట్‌గా తన కుమారుడు అన్వై ఫస్ట్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు. ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ అంతా వేడుకకి రావడంతో ఆ వేడుక చాలా సందడిగా మారింది. ఇక ఇప్పుడు దిల్ రాజు, తేజస్విని దంపతులు తమ కుమారుడితో గడుపుతూ సంతోషంగా ఉన్న ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఓ వీడియో కూడా వైరల్‌గా మారింది. ఇదులో దిల్ రాజు కొడుకు తో చిన్న పిల్లాడిలా మారి సందడి చేస్తున్నారు. అయితే ఈ వీడియో అన్వై పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించారు. తాజాగా దీనిని దిల్ రాజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.
ఈ వీడియో కోసం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్యూటిఫుల్ సాంగ్ ని కంపోజ్ చేశారు. ఈ పాటని సింగర్ కార్తీక్ ఎంతో మధురంగా పాడారు. ఈ వీడియోలో దిల్ రాజు కుటుంబ సభ్యులంతా కనిపిస్తున్నారు. దిల్ రాజు కొడుకుతో అతని మనవళ్లు మనవరాళ్లు కూడా ఆడుకుంటుండం విశేషం. ఇక దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే.. ఆయన చేతిలో ప్రస్తుతం చాలా ప్రాజెక్టులే ఉన్నాయి. వాటిలో శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్‌లో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’ ఒకటి. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నుంచి వస్తోన్న 50వ చిత్రం. ఇప్పటికే దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రంలో సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.