Dhoni : ప్రపంచ కప్ క్రికెట్‌లో ధోని అధ్యాయం ప్రత్యేకంగా లిఖించదగినది. టీమిండియాకు తన కెప్టెన్సీలో మూడు ఐసీసీ ట్రోఫీలను అందించి.. దశాబ్దాల కలను నెరవేర్చాడు. ఇక క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత తనకు ఇష్టమైన వ్యాపకాలపై టైమ్ స్పెండ్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఒక్క ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని రోజు రోజుకి తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. అయితే తాను ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నాడు. అయితే ధోని చేసిన పనికి ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ధోని రియల్లీ గ్రేట్ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.
వివరాలలోకి వెళితే ధోని చిన్ననాటి స్నేహితుడికి రాంచీలో స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ షాప్ ఉంది. ధోనీ తన బ్యాట్ పై తన స్నేహితుని షాప్ పేరు స్టిక్కర్ అంటించుకున్నాడు. ఈ బ్యాట్ తోనే ధోనీ రాబోయే ఐపీఎల్ కోసం నెట్స్ లో ప్రాక్టిస్ చేస్తూ కనిపించాడు. చిన్ననాటి స్నేహితుడి దుకాణం షాప్ పేరుతో వచ్చిన ఆ బ్యాట్ తో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రాక్టిస్ చేస్తున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రొఫెషనల్ క్రికెటర్ గా ఎదిగే క్రమంలో తనకు సహకరించిన వారిని ధోనీ ఎప్పుడూ మరచిపోలేదు. ఆయన ఎప్పుడూ కృతజ్ఞత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ధోనీ తన చిన్ననాటి స్నేహితుడికి కృతజ్ఞతగా తన షాప్ స్టిక్కర్ ను బ్యాట్ పై అతికించాడు. దీంతో ఒక్కసారిగా తన స్నేహితుడి దుకాణానికి ఆదరణ పెరిగింది.
రాంచీలో ధోనీ స్నేహితుడి స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ షాప్ పేరు ప్రైమ్ స్పోర్ట్స్ కాగా, క్రికెట్ ప్రారంభ ప్రయాణం మొదలు పెట్టిన సమయంలో ధోనీకి ఎంతో సాయం చేశాడు. దానిని గుర్తుంచుకునీ, తమ స్నేహం ఎప్పటికీ చెరిగిపోదని నిరూపిస్తూ.. ఈసారి ధోనీ తన స్నేహితుని దుకాణాన్ని ప్రమోట్ చేయడంలో సాయపడ్డాడు. ఈ విషయంపై తాజాగా స్పందించాడు పరమ్ జిత్ సింగ్. “ధోని స్నేహితుడిగా నేనెంతో గర్వపడుతున్నాను. అతడెప్పుడు మాకు అండగానే, మాతోనే ఉంటాడు. అది మా స్నేహం గొప్పదనం. ధోని నా షాప్ కు పబ్లిసిటీ కలిగించడంతో పాటుగా నాకు అతడు సంతకం చేసిన బ్యాట్ ను బహుమతిగా ఇచ్చాడు. నాకెంతో ఆనందంగా ఉంది” అంటూ ఒక్కింత భావోద్వేగానికి లోనైయ్యాడు పరమ్ జిత్ సింగ్. ప్రస్తుతం అతడు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…