Dharmavarapu Subramanyam : ధ‌ర్మ‌వ‌ర‌పు కొడుకు ఆవేద‌న‌.. నాన్న‌ను చూసేందుకు వాళ్లెవ‌రూ రాలేద‌ని కామెంట్స్‌..

Dharmavarapu Subramanyam : టాలీవుడ్‌లో త‌న కామెడీతో ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించిన కమెడీయ‌న్స్ లో ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం ఒక‌రు. ఆయ‌న కామెడీకి న‌వ్వుకొని ప్రేక్ష‌కుడు లేరు. గవర్నమెంట్ ఉద్యోగి అయిన ధర్మవరపు దూరదర్శన్ లో ‘ఆనందో బ్రహ్మ’ టైటిల్ తో కామెడీ ప్రోగ్రాం చేయ‌గా, దానికి మంచి గుర్తింపు రావ‌డంతో సినిమాల‌లో అవకాశాలు వ‌చ్చాయి. నువ్వు నేను మూవీలో ధర్మవరపు పోషించిన లెక్చరర్ పాత్ర విపరీతమైన పేరు తెచ్చింది. అక్కడ నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. కన్నుమూసే వరకు వందల చిత్రాల్లో నటించి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో మెప్పించారు.

హాస్య చ‌తుర‌త ఉన్న ధ‌ర్మ‌వ‌రపు అనారోగ్యం కారణంగా అకాల మరణం పొందారు. ఆయన కుమారుడు రవి బ్రహ్మ తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయ్యారు. ఆయన స్టార్ కమెడియన్ అయినప్పటికీ చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని చిత్రాల్లో నటించేవారని అన్నారు. . రెమ్యునరేషన్ డిమాండ్ చేయకుండా ఇచ్చినంత తీసుకునేవార‌ని, ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకొని కొందరు నిర్మాతలు డబ్బులు కూడా ఎగ్గొట్టారని చెప్పుకొచ్చాడు. అయితే త‌న తండ్రిని మోసం చేసిన నిర్మాతలు ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నారని రవి బ్రహ్మ తేజ చెప్పారు.

Dharmavarapu Subramanyam son feels emotional
Dharmavarapu Subramanyam

తండ్రి మ‌ర‌ణించాక పార్థివ దేహం చూసేందుకు రాజేంద్రప్రసాద్, హీరో గోపీచంద్, అలీ, వేణు మాధవ్, దగ్గుబాటి రామానాయుడుతో పాటు కొందరు చిత్ర ప్రముఖులు వచ్చారు. మెగా ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా రాలేదు. రావాలని అనుకున్నారట. ఎందుకో కుదర్లేదు అని ఆయ‌న అన్నారు. అయితే నాన్న చనిపోయే ముందు మాకేమీ చెప్పలేదు. ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ కి తీసుకెళ్లలేదు. నేరుగా మా సొంత ఊరు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు పూర్తి చేశాము… అని రవి బ్రహ్మ తేజ వెల్లడించారు. లివర్ క్యాన్సర్ వ‌ల‌న కొన్ని నెలలు మంచానికే పరిమితమైన ధ‌ర్మ‌వ‌ర‌పు 2013లో డిసెంబర్ 7న 59ఏళ్ల వయసులో కన్నుమూశారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago