Dharmavarapu Subramanyam : టాలీవుడ్‌లో తన కామెడీతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన కమెడీయన్స్ లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒకరు. ఆయన కామెడీకి నవ్వుకొని ప్రేక్షకుడు లేరు. గవర్నమెంట్ ఉద్యోగి అయిన ధర్మవరపు దూరదర్శన్ లో ‘ఆనందో బ్రహ్మ’ టైటిల్ తో కామెడీ ప్రోగ్రాం చేయగా, దానికి మంచి గుర్తింపు రావడంతో సినిమాలలో అవకాశాలు వచ్చాయి. నువ్వు నేను మూవీలో ధర్మవరపు పోషించిన లెక్చరర్ పాత్ర విపరీతమైన పేరు తెచ్చింది. అక్కడ నుండి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. కన్నుమూసే వరకు వందల చిత్రాల్లో నటించి ప్రేక్షకులని ఎంతగానో మెప్పించారు.
హాస్య చతురత ఉన్న ధర్మవరపు అనారోగ్యం కారణంగా అకాల మరణం పొందారు. ఆయన కుమారుడు రవి బ్రహ్మ తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయ్యారు. ఆయన స్టార్ కమెడియన్ అయినప్పటికీ చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని చిత్రాల్లో నటించేవారని అన్నారు. . రెమ్యునరేషన్ డిమాండ్ చేయకుండా ఇచ్చినంత తీసుకునేవారని, ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకొని కొందరు నిర్మాతలు డబ్బులు కూడా ఎగ్గొట్టారని చెప్పుకొచ్చాడు. అయితే తన తండ్రిని మోసం చేసిన నిర్మాతలు ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నారని రవి బ్రహ్మ తేజ చెప్పారు.
![Dharmavarapu Subramanyam : ధర్మవరపు కొడుకు ఆవేదన.. నాన్నను చూసేందుకు వాళ్లెవరూ రాలేదని కామెంట్స్.. Dharmavarapu Subramanyam son feels emotional](http://3.0.182.119/wp-content/uploads/2023/04/dharmavarapu-subramayam.jpg)
తండ్రి మరణించాక పార్థివ దేహం చూసేందుకు రాజేంద్రప్రసాద్, హీరో గోపీచంద్, అలీ, వేణు మాధవ్, దగ్గుబాటి రామానాయుడుతో పాటు కొందరు చిత్ర ప్రముఖులు వచ్చారు. మెగా ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా రాలేదు. రావాలని అనుకున్నారట. ఎందుకో కుదర్లేదు అని ఆయన అన్నారు. అయితే నాన్న చనిపోయే ముందు మాకేమీ చెప్పలేదు. ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ కి తీసుకెళ్లలేదు. నేరుగా మా సొంత ఊరు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు పూర్తి చేశాము… అని రవి బ్రహ్మ తేజ వెల్లడించారు. లివర్ క్యాన్సర్ వలన కొన్ని నెలలు మంచానికే పరిమితమైన ధర్మవరపు 2013లో డిసెంబర్ 7న 59ఏళ్ల వయసులో కన్నుమూశారు.