DGP Ravi Gupta : 22 ల్యాండ్ క్రూయిజర్ల కొనుగోలు వివాదం.. డీజీపీ ర‌వి గుప్తా ఏమ‌న్నారంటే..!

DGP Ravi Gupta : గత బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో 22 ల్యాండ్ క్రూయిజర్లు కొనుగోలు చేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఓ మీడియా సమావేశంలో చెప్పుకురాగా, దీనిపై జోరు ఎత్తున చ‌ర్చ నడిచింది. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ రవి గుప్తా స్పందించారు. సీఎం వ్యాఖ్యలను ఆయన ధ్రువీకరించారు.భద్రతా కారణాల దృష్ట్యా ఈ కొత్త వాహనాలను కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. పలువురు ప్రముఖుల భద్రత అవసరాలకు అనుగుణంగా అవసరమైనన్ని వాహనాలు కొనుగోలు చేసి అందజేస్తామని తెలిపారు. కాగా, గత ప్రభుత్వ సమయంలోనే 22 ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేసినట్లు అధికారులు తనకు తెలియజేశారని చెప్పారు. అవి ఇప్పుడు విజయవాడలో ఉన్నాయని, కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వాటిని తీసుకురావాలని అప్పటి ప్రభుత్వం భావించిదని చెప్పారు.

కొత్త వాహనాల గురించి అధికారులు తనకు చెప్పిన వెంటనే ఆశ్చర్య పోయానని రేవంత్ రెడ్డి తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కావడంతో ఒక్కో వాహనం ఖరీదు రూ.3 కోట్లు ఉందని చెప్పారు. ఈ విధంగా మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సంపదను సృష్టించారని వ్యంగ్యంగా మాట్లాడారు.తెలంగాణా డీజీపీ రవి గుప్తా వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని, పోలీసులు, మీడియా సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు పూర్తి చేశామన్నారు. గత ఏడాదితో పోలిస్తే 8.97 శాతం రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ పెరిగిందని, ఈ ఏడాది 2,13,121 కేసులు నమోదు చేశామన్నారు.

DGP Ravi Gupta told why old telangana government bought those cars
DGP Ravi Gupta

సైబర్ నేరాలు గత ఏడాదితో పోలిస్తే 17.59 శాతం పెరిగాయన్నారు. 1,108 జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. ఐపీసీ సెక్షన్ కింద 1,38,312 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 73 అత్యాచార కేసులలో 84 మందికి జీవిత ఖైదు శిక్ష పడినట్లు తెలిపారు.2023లో రాష్ట్రంలో 1,360 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే ఇవి 15.6 శాతం అధికమన్నారు. 2,52,60 కిలోల గంజాయి, 1,240 గంజాయి మొక్కలను సీజ్ చేసి.. 2583 మందిని అరెస్ట్ చేశామన్నారు. 1,877 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయన్నారు. డ్రగ్స్ నియంత్రణకు యాంటి నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 59 డ్రగ్స్ కేసుల్లో 182 మందిని అరెస్ట్ చేశామన్నారు. 175 మంది రిపీటెడ్ డ్రగ్ ఫెడ్లర్స్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశామని, 12 మంది ఫారెన్ అఫెండర్స్‌ను అరెస్ట్ చేశామన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago