Dasara Deleted Scene : నాని, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన చిత్రం దసరా. మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదలై మొదటి రోజు మొదటి ఆట తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. వారం రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరి నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.సినిమా రోజురోజుకి మంచి కలెక్షన్స్ రాబడుతూ అందరి ప్రశంసలు అందుకుంటుంది. అంతేకాదు ఈ సినిమాపై ప్రతి ఒక్కరు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో మేకర్స్ మరింత ఎగ్జైట్‌మెంట్ పెంచుతున్నారు.
ఈ క్రమంలోనే మూవీ లోని డిలీటెడ్ సీన్ ను మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని వెన్నెల ఆవేదన చూపించారు.. సీన్ లోకి వెళ్తే.. ”నిన్నే అంత కాని దాన్ని అయిపోయానా ఆడెవడో వచ్చి తాళి కడతా అంటే ఆపేది పోయి.. ఇంకా మీదకెళ్ళి తీస్కపో అని చెప్పి నన్ను వదిలించుకున్నాం. నువ్వసలు తల్లివేనా.?”.. అందరూ కూడా నా బతుకును ఎట్లా చేసిర్రో చూశినవా అని అత్త ముందు తన ఆవేదన వ్యక్తం చేస్తుంది వెన్నెల. వెంటనే ఆమె అత్త వెన్నెలను తన అత్తారింటి ముందుకు తీసుకెళ్లి గిదే నీ ఇళ్లు, ఈడ్నే నీ బతుకు. నా మాట విని లోపలికి పోవే.. నీ భాంచేనే.. వన్ టూ వెన్నెలను బతిమలాడుకొని వెళ్ళిపోతుంది. కానీ అక్కడే ఏడుస్తూ నిలబడిపోతుంది వెన్నెల.
అయితే వీరి సంభాషణనంతా అక్కడే గోడ వెనుక ఉన్న ధరణి వింటుంటాడు” ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అసలు ఇంత అద్భుతమైన సీన్ ఎందుకు డిలీట్ చేశారు అంటూ అభిమానులు ప్రశిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ నటించింది. ధరణిగా నాని నటించగా.. వెన్నెలగా కీర్తి సురేష్ కనిపించి మెప్పించారు. ఈ సినిమాకు సెన్సార్ వారు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే విడుదలకు ముందు ఈ సినిమా నుంచి ఏకంగా 16 సీన్స్ కట్ చేశారని వార్తలు వినిపించాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…