Daggubati Rana : టాలీవుడ్‌లోకి మరో వారసుడు రాబోతున్నాడు. యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ నటించిన బబుల్‌గమ్ సినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ కానుండగా, ఈ సినిమాతో రోషన్ వెండితెర ప్రేక్షకులని పలకరించనున్నాడు. చిత్ర రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. రీసెంట్‌గా మూవీ ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.వేడుకలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, టాలీవుడ్ భళ్లాలదేవ రానా దగ్గుబాటి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. యాంకర్ సుమ నాకు నిద్రలేకుండా చేసిందనే వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అయ్యాయి.
సాధారణంగా నేను బర్త్ డే పార్టీ అయ్యాక రెండు రోజులు లేవను. కాని సుమ గారి వలన ఈ రోజు రావల్సి వచ్చింది. సుమ గారు సినిమా ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు. ఈ రోజు వారి అబ్బాయి ఇండస్ట్రీకి రావడం సంతోషంగా ఉంది. సినిమా మంచి హిట్ కావడం గ్యారెంటీ అని ఆయన అన్నారు. అలానే రివెంజ్ గురించి మాట్లాడమంటే నన్ను ఎవరు ఏది చేసే దమ్ము ఉండదు, నాకు రివెంజ్ అనేది చూలా దూరం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రానా వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇక 42 సెకన్ల నిడివి ఉన్న బబుల్ గమ్ ట్రైలర్.. రోషన్ మాస్ ఫైట్ తో ప్రారంభమైంది. యాక్షన్ సన్నివేశాల్లో, రొమాంటిక్ సన్నివేశాల్లో, ఎమోషనల్ సన్నివేశాల్లో రోషన్ బాగానే నటించినట్టు ట్రైలర్ లో కనిపిస్తోంది. మానస చౌదరీ కూడా గ్రామర్ షో బాగానే చేసినట్లు ఉంది. ఓ యువకుడి జీవితంలో ప్రేమ, శత్రుత్వం వంటి పరిస్థితులు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశంతో సినిమా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. సినిమాలో వైవా హర్ష, అనన్య ఆకుల, కిరణ్, అను హసన్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జైరామ్ ఈశ్వర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ లో క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్ పేరెపు దర్శకత్వంలో చిత్రం రూపొందుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…