CM YS Jagan : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా రంజుగా సాగుతుంది. ఈ సారి ఎవరు అధికారంలోకి వస్తారా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. కూటమి వస్తుంది అని కొందరు అంటుంటే లేదు లేదు వైసీపీనే మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందని చెబుతున్నారు. ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో ఎలా విమర్శలు కురిపించుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సామాజిక పించన్లు, ల్యాండ్ టైటిలింగ్‌లో కూటమని దోషిగా నిలబెట్టి సక్సెస్ అయింది వైసీపీ. అనేక విషయాలలో ఆధారాలతో సహా బయటపెట్టి కూటమని ఓ రేంజ్‌లో ఆడుకుంది వైసీపీ.
ఇక ఇప్పుడు జగన్ ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తున్నామని.. గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు… మే 16న గురువారం ఐ ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్లో ఉన్న ఐ ప్యాక్ ఆఫీస్ కు చేరుకుని ఆ టీంను కలిసి కృతజ్ఙతలు చెప్పారు. సీఎం జగన్ రాక నేపథ్యంలో ఐ ప్యాక్ టీం సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ కోసం పనిచేసినందుకు ఐ ప్యాక్ టీం ప్రతినిధులను అభినందించారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో బెంజ్ సర్కిల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
మే 17న విదేశీ పర్యటనలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన పోలింగ్ శాతం, విజయావకాశాలపై ఐ ప్యాక్ ప్రతినిధులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీకి విజయావకాశాలు ఏ మేర ఉన్నాయి అనే దానిపై సమాచారం అడిగి తెలుసుకునేందుకు అక్కడకు చేరకున్నారన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే బొత్స జూన్ 9న జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నరు. దీంతో టీడీపీ మైండ్ గేమ్‌కి వైసీపీ అనేక రకాలుగా చెక్ పెడుతున్నట్టు అయింది. ఇప్పుడు కూటమి గెలుపు సంగతేమో కాని ఆత్మ రక్షణలో పడిపోయినట్టు తెలుస్తుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…