CM YS Jagan : రానున్న ఎన్నికలలో వైసీపీ తిరిగి విజయం సాధించాలని కసితో ఉంది. ఈ క్రమంలో జగన్ అనేక ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఆచితూచి టిక్కెట్ ఇస్తున్నారు. గుడివాడ అమర్నాథ్‌కు జగన్ మోహన్ రెడ్డి సీటు ఇస్తారా లేదా అనే దానిపై జోరుగా చర్చ జరుగుతుండగా, ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయన తన గుండెల్లో ఉన్నారని.. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అనకాపల్లి ప్రజల ముందు చెప్పారు. ఇప్పుడు అభ్యర్థిగా భరత్ ను గెలిపించాలని కోరారు. చేయూత పథకం బటన్ నొక్కేందుకు అనకాపల్లి పర్యటనకు వచ్చిన సీఎం జగన్.. అమర్నాథ్ పోటీపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
అమర్నాథ్ పై కీలక కామెంట్లు చేశారు.. కుడి, ఎడమ అమర్నాథ్, భరత్ వున్నారు ఇద్దరు తమ్ముళ్లు… అమర్నాథ్ కు భవిష్యత్ లో చాలా మంచి జరుగు తుంది.. నా గుండెల్లో పెట్టుకుంటాను అన్నారు. భరత్ పోటీ చేస్తున్నాడు ఆశీర్వదించండి అని విజ్ఞప్తి చేశారు. మంత్రి అమర్ పోటీపై అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లేకుండా పోవడంతో.. సీఎం జగన్ పాల్గొన్న సభా వేదికగానే అమర్నాథ్ తనకున్న ఇబ్బందులను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటూ చాలామంది తనను ప్రశ్నిస్తున్నారని అమర్ పేర్కొన్నారు. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేసిన గుడివాడ అమర్.. జగనన్న ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించేందుకు అంకితభావంతో పని చేస్తానని స్పష్టం చేశారు. సీఎం జగన్ తన మీద నమ్మకంతో 15 నియెజికవర్గాల బాధ్యతలను అప్పగించారని, ఈ 15 నియోజకవర్గాలకు డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్‌గా తనకు బాధ్యతలను అప్పగించారన్నారు.
ఆయా నియెజికవర్గాలను గెలిపించి మళ్లీ జగన్ ను సీఎం చేస్తానని మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. 15 నియోజకవర్గాల కార్యకర్తల కోసం తాను పని చేస్తానని, ఇందు కోసం అవసరమైతే పోటీ నుంచి కూడా తప్పుకుంటానని అమర్ వెల్లడించారు. అందరి తలరాతలను దేవుడు రాస్తే, తన తలరాతను మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి రాస్తారని ఈ సందర్భంగా అమరనాథ్ స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సాక్షిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కేడర్ ను అయోమయంలోకి నెట్టాయి. ముఖ్యంగా అమర్నాథ్ అభిమానులను కొంత నిరాశకు గురి చేశాయని చెప్పవచ్చు. అనకాపల్లి అసెంబ్లీ స్థానంలో పోటీ చేయనప్పటికీ మరోచోట తమ నాయకుడు పోటీ చేస్తాడని ఆయన అభిమానులు చెబుతూ వస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…